వంగా వద్దన్నాడు.. వాళ్ళు భరిస్తారా?
ఇటీవల స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకొణెను తప్పించబడినట్టు వచ్చిన వార్తలు టాలీవుడ్ సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీశాయి.
By: Tupaki Desk | 22 May 2025 12:56 PMఇటీవల స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకొణెను తప్పించబడినట్టు వచ్చిన వార్తలు టాలీవుడ్ సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. సందీప్ రెడ్డి వంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆమె పెట్టిన డిమాండ్లు కారణమని టాక్. రోజుకు కేవలం ఆరుగంటలే పని చేయడం, 100 రోజుల లోపు తన పార్ట్ కంప్లీట్ చేయాలన్న షరతులు, అంతకు మించి అయితే అదనంగా రెమ్యునరేషన్ ఇవ్వాలన్న డిమాండ్లు నిర్మాతలను ఆలోచనలో పడేశాయట. అంతేకాక, ఆమె సొంత టీమ్ ఖర్చులు కూడా ముంబై నుంచి సెట్ దాకా మేనేజ్ చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ కఠినమైన షరతుల నేపథ్యంలో, స్పిరిట్ ప్రాజెక్టు నుంచి ఆమెను తప్పించడం వల్ల సందీప్ వంగాపై అంతగా నెగిటివ్ కామెంట్స్ అయితే ఏమి రాలేదు. కానీ ఇప్పుడు దీపికా మరో భారీ ప్రాజెక్ట్‌కు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కొత్త టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీలో దీపికా హీరోయిన్‌గా ఖరారైనట్లు సమాచారం.
ఫ్యాషన్, గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌లోను తనదైన ముద్ర వేసే దీపికా ఈ సినిమాలో బన్నీతో స్క్రీన్ షేర్ చేయనుండటం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని టాక్. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి తారలు కీలక పాత్రల్లో నటించనున్నారని సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని, షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇప్పుడే చర్చ ఏమిటంటే.. వంగా వద్దన్న దీపికాను అట్లీ టీమ్ ఎలా మ్యానేజ్ చేయబోతుందనే విషయం వైరల్ అవుతోంది. ఆమె డిమాండ్లు మారలేదని టాక్. మరి బడ్జెట్ పరంగా వెనకాడని సన్ పిక్చర్స్ టీమ్, ఈ డిమాండ్లను మేనేజ్ చేయగలదా? లేక ఇదీ చర్చల దశలోనే ఎండ్ అవుతుందా? అన్నదే ప్రస్తుత హాట్ టాపిక్.
అయితే అల్లు అర్జున్ మార్కెట్, అట్లీ బ్రాండ్ విలువ, ప్రాజెక్ట్ స్థాయి చూసుకుంటే, దీపికా వంటి స్టార్ హీరోయిన్‌ను సమర్థవంతంగా మేనేజ్ చేసే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మూవీ బన్నీ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకం. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ ఫాలోవింగ్ పాన్ ఇండియా స్థాయిలో ఎలా ఉందొ చెప్పనక్కర్లేదు.
అట్లీ ఇప్పటికే జవాన్‌తో భారీ హిట్ ఇచ్చాడు. ఈ కాంబినేషన్‌లో సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా నిజంగా గ్రాండ్ విజన్‌ను కలిగిన ప్రాజెక్ట్. దీపికా కూడా ఇందులో భాగమైతే, మరో హైప్డ్ హాలీవుడ్ స్టైల్ మూవీ తెలుగులో ఆవిష్కృతం కానుంది. ఇక చివరగా ఆమె డిమాండ్లు.. నిర్మాణ బడ్జెట్‌తో పాటు సమయాన్ని కూడా ఎలా ప్రభావితం చేస్తాయో చూడాల్సిందే.