Begin typing your search above and press return to search.

బ్రహ్మీ పొట్టపై కొట్టిన.. 'అతడు' హీరోగా..

టాలీవుడ్‌లో బాల నటులుగా అనేకమంది నటిస్తారు. కానీ కొంతమంది మాత్రమే పెద్దయ్యాక హీరోహీరోయిన్లుగా సక్సెస్ అవుతారు

By:  Tupaki Desk   |   24 Jan 2024 6:04 AM GMT
బ్రహ్మీ పొట్టపై కొట్టిన.. అతడు హీరోగా..
X

టాలీవుడ్‌లో బాల నటులుగా అనేకమంది నటిస్తారు. కానీ కొంతమంది మాత్రమే పెద్దయ్యాక హీరోహీరోయిన్లుగా సక్సెస్ అవుతారు. సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుంచి అక్కినేని అఖిల్ వరకూ సక్సెస్ బాట పట్టిన హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో చైల్ట్ ఆర్టిస్ట్ లుగా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారే. అయితే ఇటీవలే కాలంలో మళ్లీ చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరో హీరోయిన్లుగా ఎక్కువ మంది అరంగేట్రం చేస్తున్నారు.

ఒకప్పటి చైల్ట్ ఆర్టిస్ట్ తేజ సజ్జ.. ఇటీవలే హనుమాన్ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా సూపర్ ఫేమ్ సంపాదించుకున్నారు. కమెడియెన్ వేణు తెరకెక్కించిన తొలి సినిమా బలగంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కల్యాణ్ రామ్. ఫస్ట్ మూవీలోనే తన యాక్టింగ్ తో అందచందాలతో ఆకట్టుకుందీ భామ. ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్.. సిద్ధార్ధ్ రాయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అతడు మూవీలో బ్రహ్మానందం కొడుకుగా నటించారు చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్. సినిమాలో బ్రహ్మీ పొట్టపై ఓ పంచ్ ఇచ్చి.. మన స్కూల్ బెంచ్‌ లా ఎంత గట్టిగా ఉందోరా అని దీపక్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది. ఆ సినిమాలో చాలా సీన్లలో కనిపిస్తాడు దీపక్. అలా అనేక సినిమాల్లో చైల్ట్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ దర్శకుల దగ్గర పనిచేసిన వి.యశస్వి.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ నిన్ననే మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ను చూస్తుంటే అర్జున్ రెడ్డి సినిమానే గుర్తొచ్చిందని నెటిజన్లు చెబుతున్నారు. ఆ రేెంజ్ లో బోల్డ్, యాక్షన్, ఎమోషన్ కంటెంట్ తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు దీపక్. వచ్చే నెలలో ఈ మూవీ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

అయితే ఇప్పుడు దీపక్ సరోజ్ కోసమే నెట్టింట చర్చ నడుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే మల్టీ పుల్ షేడ్స్ లో దీపక్ అదరగొట్టినట్లు అర్ధమవుతోందని నెటిజన్లు చెబుతున్నారు. డైరెక్టర్ కూడా హీరోకు ఇచ్చిన ఎలివేషన్లు బాగున్నాయని అంటున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న దీపక్.. హీరోగా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి దీపక్ కు ఫస్ట్ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.