Begin typing your search above and press return to search.

డెకాయిట్ గ్లింప్స్.. సుప్రియ 'బ్యానర్' ను గమనించారా?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో డెకాయిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 May 2025 3:30 PM
డెకాయిట్ గ్లింప్స్.. సుప్రియ బ్యానర్ ను గమనించారా?
X

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో డెకాయిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహిస్తుండగా.. దివంగత అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నిర్మాత సుప్రియ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

అయితే టీజర్ రిలీజ్ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్.. రీసెంట్ గా సినిమా నుంచి ఫైర్ గ్లింప్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మృణాల్‌ జూలియట్‌ పాత్రలో కనిపించగా.. తాను మోసం చేయడానికి రాలేదంటూ అడివి శేష్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఫైర్ గ్లింప్స్ తో అంచనాలు కూడా పెరుగుతున్నాయి.

అదే సమయంలో గ్లింప్స్ స్టార్టింగ్ లో ఎస్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్ నేమ్ కనిపిస్తుంది. ఆ బ్యానర్ పైనే సుప్రియ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, సుప్రియ తొలుత హీరోయిన్ గానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా నటించలేదు.

అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అలా నిర్మాతగా బిజీగా మారిపోయారు. అయితే అడివి శేష్ నటించిన గూఢచారి మూవీ కీలక పాత్రలో నటించారు. దీంతో ఒక్కసారి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు సుప్రియ. ఆ సినిమా సీక్వెల్ లో కూడా నటిస్తున్నట్లు కొద్ది రోజులు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పుడు డెకాయిట్ మూవీకి గాను సుప్రియ.. తన పేరెంట్స్ పెట్టిన బ్యానర్ ను మళ్ళీ రివైవ్ చేశారు. S.S అంటే సురేంద్ర, సత్యవతి. కాగా, యార్లగడ్డ సురేంద్ర గతంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున శివ, గాయం వంటి సినిమాలు ఎస్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించారు. మంచి హిట్స్ కూడా సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు ఆ బ్యానర్ పై సుప్రియ డెకాయిట్ మూవీని నిర్మిస్తున్నారు. శరవేగంగా ఆ సినిమాను షూటింగ్ ను జరుపుతున్నారు. క్రిస్మస్ కానుకగా ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు గ్లింప్స్ తోనే చెప్పారు మేకర్స్. మరి డెకాయిట్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో? సుప్రియ తన పేరెంట్స్ బ్యానర్ పై తీసిన మూవీతో ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాలి.