Begin typing your search above and press return to search.

లోకేష్ క‌న‌గ‌రాజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇది లోకేష్ మార్క్ సినిమా కాదంటూ ఓ వ‌ర్గం గ‌ట్టిగానే వాద‌న‌ని సోష‌ల్ మీడియా వేదికగా తీసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   15 Dec 2023 5:58 AM GMT
లోకేష్ క‌న‌గ‌రాజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం
X

అప్ క‌మింగ్ రిలీజ్ ల విష‌యంలో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడా? ఇక‌పై లోకేష్ నిర్ణయాలు ప్రేక్ష‌కులకు అంద‌ని విధంగా ఉంటాయి? అంటే అవున‌నే తెలుస్తోంది. 'ఖైదీ'..'విక్ర‌మ్' విజ‌యాల‌తో లొకేష్ క‌న‌గరాజ్ పాన్ ఇండియాలో ఎంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు విజ‌యాలు లొకేష్ కి అసాధార‌ణ క్రేజ్ ని తీసుకొచ్చాయి.

అటుపై విజ‌య్ తో తెర‌కెక్కించిన 'లియో'సైతం భారీ విజ‌య‌మే సాధించింది. బాక్సాఫీస్ వ‌సూళ్లకు తిరుగులేదు. కానీ లియో విష‌యంలో విమ‌ర్శ‌లు అదే స్థాయిలో తెర‌పైకి వ‌చ్చాయి. ఇది లోకేష్ మార్క్ సినిమా కాదంటూ ఓ వ‌ర్గం గ‌ట్టిగానే వాద‌న‌ని సోష‌ల్ మీడియా వేదికగా తీసుకొచ్చింది. ఈ విష‌యంలో లోకేష్ సైతం వాటితో ఏకీభ‌వించాడు. సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద గెలిచింది అంటూనే మరో వైపు విమ‌ర్శ‌కుల‌కు స‌మధానం చెబుతాన‌ని నెమ్మ‌దిగా క్రిటిసిజ‌మ్ ని స్కిప్ చేసాడు.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ విష‌యం తెర‌పైకి రాలేదు. అయితే లొకేష్ మాత్రం అలెర్ట్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది. ఈనేప‌థ్యంలో లొకేష్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక‌పై త‌న సినిమా రిలీజ్ తేదీల్ని ముందుగా ప్ర‌క‌టించ‌న‌ని ఒట్టు పెట్టుకున్నాడు. షూటింగ్ వెళ్ల‌కుండానే రిలీజ్ తేదీ ప్ర‌క‌టించ‌డం అన్న‌ది ఒత్తిడికి దారి తీస్తుంద‌ని..'లియో' విష‌యంలో కొంత ఒత్తిడికి గురైన‌ట్లు చెప్ప‌క‌నే చెప్పాడు.

ఇక‌పై లొకేష్ నుంచి రిలీజ్ అయ్యే ఏ సినిమా రిలీజ్ తేదీ కూడా ముందుగా ప్ర‌క‌ట‌న ఉండ‌ద‌ని తెలు స్తుంది. `లియో` సెట్స్ కి వెళ్ల‌డానికి ముందుగానే ఫ‌లానా రోజున రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అన్న‌ట్లు గానే ఎక్క‌డా వాయిదా వేయ‌కుండా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్ష‌కుల్లోకి తీసుకొచ్చారు. కానీ ఈ ప్రాస‌స్ లో లోకేష్ ఎంత‌టి ఒత్తిడికి గురై ఉంటాడో? నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. లొకేష్ లాంటి పాన్ ఇండియా మేక‌ర్ తొంద‌ర‌ప‌డ‌కుండా స‌మ‌యం తీసుకుని చేస్తే మంచి ఔట్ ఫుట్ వ‌స్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.