Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్.. డిసెంబర్ క్లాష్ అంతకుమించి!

ఈ ఏడాది డిసెంబర్ నెలలో సినిమాల సందడి గట్టిగా ఉంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలా సినిమాలు డిసెంబర్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి

By:  Tupaki Desk   |   4 Oct 2023 12:30 PM GMT
బాక్సాఫీస్.. డిసెంబర్ క్లాష్ అంతకుమించి!
X

ఈ ఏడాది డిసెంబర్ నెలలో సినిమాల సందడి గట్టిగా ఉంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలా సినిమాలు డిసెంబర్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు హైఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్కాబోతున్నాయి. ఇక ఈ లైన్ ఆర్డర్ చూసుకుంటే డిసెంబర్ 1నుంచి ప్రారంభం అయిపోతుంది. ఆ రోజు హిందీలో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యానిమల్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది.

అదే రోజు హాలీవుడ్ మూవీ సైలెంట్ నైట్ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 8న విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ కాంబినేషన్ లో హిందీలో తెరకెక్కుతోన్న మేరీ క్రిస్మస్ మూవీ రిలీజ్ కానుంది. అదే రోజు కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా నిర్మించిన యోధా మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. అలాగే హాలీవుడ్ మూవీ వంకా ప్రేక్షకుల ముందుకి రానుంది.

డిసెంబర్ 15న ధనుష్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న కెప్టెన్ మిల్లర్ మూవీ రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. డిసెంబర్ 21న నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే రిలీజ్ టైంని పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

డిసెంబర్ 21న హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ 2 ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు గట్టిగా ఉన్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్థాయిలో సలార్ సినిమాపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

షారుఖ్ ఖాన్ డుంకీ కూడా డిసెంబర్ 22న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ ఉంటుందని ఎనౌన్స్ చేశారు. ఈ మూవీ వాయిదా పడొచ్చని భావిస్తున్నారు. డిసెంబర్ 29న మైగ్రేషన్ అనే హాలీవుడ్ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ చిత్రాలలో ఏ మూవీ ప్రేక్షకుల అంచనాలు అందుకొని బాక్సాఫీస్ కింగ్ గా నిలుస్తుందనేది చూడాలి.