Begin typing your search above and press return to search.

2023 ముంగింపు ఏకంగా 27 తో స‌ర్ ప్రైజ్!

2023 ఏడాది ముగింపుకు వ‌చ్చేసాం. ఈవారంతో పాత ఏడాదికి బైబై చెప్పి కొత్త ఏడాది 2024 లోకి అడుగు పెట్ట‌బోతున్నాం

By:  Tupaki Desk   |   25 Dec 2023 12:30 PM GMT
2023 ముంగింపు ఏకంగా 27 తో స‌ర్ ప్రైజ్!
X

2023 ఏడాది ముగింపుకు వ‌చ్చేసాం. ఈవారంతో పాత ఏడాదికి బైబై చెప్పి కొత్త ఏడాది 2024 లోకి అడుగు పెట్ట‌బోతున్నాం. ఇక థియేట‌ర్లో ఏడాది ముగింపు శుక్ర‌వారం క‌ళ్యాణ్ రామ్ న‌టించిన 'డెవిల్' రిలీజ్ అవుతుంది. దీంతో పాటు యాంక‌ర్ సుమ కొడుకు న‌టించిన 'బ‌బుల్ గ‌మ్' కూడా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఈ రెండు రిలీజ్ ల‌తో 2023 చివ‌రి శుక్ర‌వారం ముగిసిన‌ట్లే.

మ‌రి చివ‌రిగా ఓటీటీలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ముంగిపుగా ఓటీటీ అభిమానుల‌కు ఎంత మంది హీరోలు స‌ర్ ప్రైజ్ చేస్తున్నారంటే? ఈ వారంలో ఏకంగా 27 సినిమాల‌వ‌ర‌కూ రిలీజ్ అవుతున్నా య‌ని తెలుస్తోంది. వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై పెద్ద ఎత్తున రిలీజ్ లు క‌నిపిస్తున్నాయి. నెట్ ప్లిక్స్ లో 'రికీ గైర్వాస్: ఆర్మ్ గెడ్డొన్'..'స్నాగ్' లాంటి ఇంగ్లీష్ చిత్రాలు డిసెంబ‌ర్ 25న రిలీజ్ అవుతున్నాయి.

ఇంకా 'కో గ‌యే హ‌మ్ క‌హా'..'థాంక్యూ' ఐయామ్ సారీ' లాంటి చిత్రాలు డిసెంబ‌ర్ 26న‌.. 'ఏవెరీ గుడ్ గ‌ర్ల్'.. 'హెల్ క్యాంప్' లాంటి చిత్రాలు ఇదే నెల 27న‌.. 'లిటిల్ డిక్స్'.. 'మిస్ శాంపో'.. 'పోకేమ‌న్ క‌న్స‌ర్జ్'.. 28న‌.. 'అన్న‌పూర‌ణి'.. 'బ్యాడ్ ల్యాండ్స్'..'బెర్లిన్'.. 'శాస్త్రి విరుద్ శాస్త్రి'..'త్రీ ఆఫ్ అజ్' లాంటి చిత్రాలు 29న‌.. 'డేంజ‌ర‌స్ గేమ్'..' ది అబాండ‌డ్' లాంటి చిత్రాలు 31న రిలీజ్ అవుతున్నాయి.

అలాగే అమెజాన్ ప్రైమ్ లో 'క‌టాట‌న్' 'ఎస్ ఐ బాయ్' ఇండోనేషియా మూవీ డిసెంబ‌ర్ 27న‌.. హిందీ చిత్రం 'టైగ‌ర్ -3' డిసెంబ‌ర్ 31 అందుబాటులో ఉంటాయి. ఇక హాట్ స్టార్ లో 'మంగ‌ళ‌వారం' డిసెంబ‌ర్ 26న‌.. '12 త్ ఫెయిల్' డిసెంబ‌ర్ 29న రిలీజ్ అవుతున్నాయి. అలాగే జీ5 లో 'దోనో' డిసెంబ‌ర్ 29న‌..'వ‌న్స్ అపాన్ టూ టైమ్స్'..'స‌ఫేద్' లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. 'అస్ట‌రాయిడ్ సిటీ' డిసెంబ‌ర్ 25న‌.. 'ఎవ్రీబ‌డీ' డిసెంబ‌ర్30 జీయో లో రిలీజ్ అవుతున్నాయి. 'ల‌య‌న్స్ గెట్ ప్లే' .. 'ది క‌ర్స్' అనే ఇంగ్లీష్ చిత్రం డిసెంబ‌ర్ 29 న రిలీజ్ అవుతుంది. ఇంకా బుక్ మై షోలో 'ట్రోల్స్ అండ్ టుగెద‌ర్' డిసెంబ‌ర్ 29న రిలీజ్ అవుతున్నాయి. మొత్తంగా ఏడాది ముగింపులో ఓటీటీలో అభిమానుల‌కు ట్రీట్ అవ్వ‌డానికి చాలా సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి.