సంక్రాంతికి ముందు సునామీలా డిసెంబర్!
డిసెంబర్5న చిత్రం రిలీజ్ అవుతుంది. అదే నెల 25న భారీ 'డెకాయిట్' రిలీజ్ అవుతుంది. అడవి శేషు హీరోగా నటిస్తోన్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
By: Tupaki Desk | 5 Jun 2025 8:54 PM ISTఏడాదిలో కొన్ని సీజన్లు సినిమా రిలీజ్ లకు ఎంతో అనుకూలమైనవి. ఏడాది ఆరంభంలో వచ్చే సంక్రాంతి ... అటుపై దసరా, క్రిస్మస్ లాంటి సీజన్లను స్టార్ హీరోలెవరు మిస్ చేసుకోరు. స్టార్ హీరోలంతా ఆ మూడు సీజన్లలో పోటీ పడటానికి ఇష్టపడుతుంటారు. వాళ్లతో పాటు మీడియం రేంజ్ హీరోలు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గరు. తక్కువ థియేటర్లు దొరికినా? ఆక్యుపెన్సీకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రెండు సీజన్లు టార్గెట్ గా ఉంటాయి.
మరి ఏడాదిలో అలాంటి సీజన్ మరోకటి ఉందా? అంటే అవుననే అనాలి. జన వరి..అక్టోబర్ తర్వాత డిసెంబర్ కూడా హాట్ టాపిక్ గామారుతుంది. క్రిస్మస్ సందర్భంగా సినిమాలు రిలీజ్ అవుతాయి కానీ చాలా కాలం పాటు పెద్దగా హైలైట్ కాలేదు. అయితే ఈ రెండు మూడేళ్లగా డిసెంబర్ కూడా హాట్ టాపిక్ గా మారుంది. డిసెంబర్ లోనూ అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మోత మెగిస్తున్నాయి.
దీంతో డిసెంబర్ లో ముందొస్తు రిలీజ్ లకు కర్చీపులు వేసే పరిస్థితి నెలకొంది. 'అఖండ', 'పుష్ప', 'సలార్' లాంటి సినిమాలు డిసెంబర్ లో రిలీజ్ అయినవే. 'సలార్', 'పుష్ప' చిత్రాలు ఏకంగా వందల వేల కోట్లు వసూళ్లు సాధించాయి. 'అఖండ' పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా ఆ రేంజ్ లో ఫేమస్ అయింది. దీంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం 'రాజాసాబ్' రిలీజ్ కూడా డిసెంబర్ లో ఫిక్సైన సంగతి తెలిసిందే.
డిసెంబర్5న చిత్రం రిలీజ్ అవుతుంది. అదే నెల 25న భారీ 'డెకాయిట్' రిలీజ్ అవుతుంది. అడవి శేషు హీరోగా నటిస్తోన్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. స్పై థ్రిల్లర్ చిత్రాల్లో అతడో స్పెషల్గా మారడంతో డెకాయిట్ పై మంచి బజ్ నెలకొంది. అలాగే మరికొన్ని కీలక సినిమాలు కూడా అదే నెలలో రిలీజ్ డేట్ ను సెట్ చేసుకునే పనిలో ఉన్నాయి. 'అఖండ 2' సెప్టెంబర్ మిస్ అయితే డిసెంబర్ లో దిగిపోతుందని బలంగా వినిపిస్తుంది. చిరంజీవి 'విశ్వంభర' కూడా డిసెంబర్ కి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
