డిసెంబర్ సెంటిమెంట్ తో బ్లాక్ బస్టర్ ఖాయమేనా?
కొత్త సినిమా రిలీజ్ లకు కొన్ని సీజన్లు బాగా కలిసొస్తుంటాయి. `సంక్రాంతి`, `దసరా` లాంటి సీజన్లను టాలీవుడ్ హీరోలు అస్సలు మిస్ చేసుకోరు.
By: Tupaki Desk | 13 July 2025 6:00 PM ISTకొత్త సినిమా రిలీజ్ లకు కొన్ని సీజన్లు బాగా కలిసొస్తుంటాయి. `సంక్రాంతి`, `దసరా` లాంటి సీజన్లను టాలీవుడ్ హీరోలు అస్సలు మిస్ చేసుకోరు. ఆ రెండు సీజన్లతో తప్పని సరిగా అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కు ఉండేలా చూసుకుంటారు. సెలవు రోజులు కలిసొస్తాయి కాబట్టి సినిమా యావరేజ్ టాక్ తెచ్చు కున్నా గట్టెక్కేసే అవకాశం ఉంటుంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆ బొమ్మకు తిరుగే ఉండదు. ఏడాది చివరి నెలైన డిసెంబర్ లో కూడా ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి.
క్రిస్మస్ ను పురస్కరించుకుని స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. గత రెండు సంవత్సరాలుగా డిసెంబర్ సెంటిమెంట్ కూడా బాగానే కలిసొస్తుంది. 2023 డిసెంబర్ 1న రణబీర్ కపూర్ నటించిన `యానిమల్` రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ విజయం కపూర్ బోయ్ కి ...దర్శకుడు సందీప్ రెడ్డికి మంచి పేరును తీసుకొచ్చింది. సినిమాపై కొన్ని విమర్శలు వ్యక్తమైనప్పటకీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 900 కోట్ల వసూళ్లను రాబట్లిన సంగతి తెలిసిందే.
అటుపై 2024 డిసెంబర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందే అంచనాలు పీక్స్ లో ఉన్నా యి. కానీ వాటిని మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ హీరోల బాక్సాఫీస్ చరిత్ర ను సైతం `పుష్ప 2` తిరగరాసింది. ఆ లెక్కన చూసుకుంటే 2025 డిసెంబర్ రణవీర్ సింగ్ దే అవ్వాలి.
ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న `ధురందర్` డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుంది. `ఉరి` ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. పాకిస్తాన్ నేపథ్యంలో సాగే ఇండియన్ స్పై యాక్షన్-థ్రిల్లర్ ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా , అర్జున్ రాంపాల్ వంటి స్టార్లు సినిమాలో భాగమవ్వడం మరింత గా కలిసొస్తుంది. ఈ డిసెంబర్ కు `ధురందర్` బ్లాక్ బస్టర్ అయితే డిసెంబర్ పరంగా హ్యాట్రిక్ నమోదైనట్లే.
