Begin typing your search above and press return to search.

టీజర్: తెలుగమ్మాయి హీరోయిన్ గా నటిస్తూ నిర్మించిన ‘డియర్ ఉమ

అలాంటిది ఇప్పుడు సుమయా రెడ్డి అనే ఒక తెలుగమ్మాయి హీరోయిన్ గా మాత్రమే కాదు నిర్మాతగా, కథ రచయితగా ప్రేక్షకులను పలకరించబోతోంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 3:04 PM GMT
టీజర్: తెలుగమ్మాయి హీరోయిన్ గా నటిస్తూ నిర్మించిన ‘డియర్ ఉమ
X

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడిస్తున్నా, మన ఇండస్ట్రీ నుంచి తెలుగు కథానాయికలు మాత్రం రావడం లేదు. ఎప్పుడో ఒకరు ఇద్దరు వస్తున్నారు తప్పితే, మన సినిమాల్లో పెద్దగా తెలుగు అందాలు కనిపించడం లేదు. అలాంటిది ఇప్పుడు సుమయా రెడ్డి అనే ఒక తెలుగమ్మాయి హీరోయిన్ గా మాత్రమే కాదు నిర్మాతగా, కథ రచయితగా ప్రేక్షకులను పలకరించబోతోంది.


'దియా' ఫేమ్ పృథ్వీ అంబార్, సుమయా రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'డియర్ ఉమ'. సుమయ స్వయంగా కథ అందించారు. డైరెక్టర్ సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు.

రాక్‌ స్టార్‌గా మారాలని తపించే యువకుడిగా పృథ్వీ అంబార్ పాత్ర పరిచయంతో ‘డియర్ ఉమ’ టీజర్ ప్రారంభమైంది. “నా లైఫ్ లో ప్రతీదీ గెట్ అవుట్ సిట్యుయేషన్ యే...” అంటూ తనని తాను ఫెయిల్యూర్ గా పరిచయం చేసుకుంటాడు. తొలి చూపులోనే అతను సుమయా రెడ్డితో ప్రేమలో పడతాడు. 'నేను రాక్ స్టార్ అయితే నువ్వు నన్ను లవ్ చేస్తావా?' అని అడుగుతాడు. దీనికి ‘ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన నిర్వచనం’ అని చెప్పడం చూస్తుంటే.. ఆ అమ్మాయికి కూడా ప్రేమ పట్ల గొప్ప అనుభూతి ఉందని అర్థమవుతోంది. కానీ ఆమె ప్రేమను పొందడంలో అతను విఫలమైనట్లుగా టీజర్ ని బట్టి తెలుస్తోంది.

‘డియర్ ఉమ’ టీజర్ చూస్తుంటే.. ఇది ప్రేమ, దాని వల్ల కలిగే సంతోషం, బాధ వంటి అన్ని రకాల భావోద్వేగాలు కలబోసిన రొమాంటిక్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. ఇందులో యాక్షన్ కూడా ఉన్నట్లు చివర్లో హింట్ ఇచ్చారు. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సుమయా రెడ్డి అందంగా కనిపించింది. ‘నా కణాల్లో జీవం నీ కళ్లు.. నా నరాల్లో ప్రవాహాం నీ చూపు’ ‘అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉండదు.. అమ్మాయిల స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది.. అమ్మాయిలిచ్చే షాక్‌లకు.. అబ్బాయిలకు ఇదే సరైన మెడిసిన్’ వంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.

ఓవరాల్ గా ‘డియర్ ఉమ’ టీజర్ సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ ను కలిగిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రాజ్ తోట కెమెరా వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సాయి రాజేష్ మహదేవ్ తన మాటలతో టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. సత్య గిడుతూరి ఎడిటింగ్ చేసారు. ఈ సినిమాలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై సుమయా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్వవహరిస్తున్నారు.

హీరోయిన్ గా నటిస్తూనే, నిర్మాతగా వ్యవహరించడం, దానికి మించి రచయితగా ఆ సినిమాకు కథను కూడా అందించడం అంటే మామూలు విషయం కాదు. ఆ విధంగా మల్టీటాలెంట్ అనిపించుకున్న సుమయ రెడ్డి.. 'డియర్ ఉమ'పై చాలా నమ్మకంగా ఉంది. త్వరలోనే ఈ అందమైన ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. మరి తెలుగమ్మాయికి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.