Begin typing your search above and press return to search.

డియర్ ఉమ’ ట్రైలర్.. సమ్ థింగ్ స్పెషల్ అనేలా..

తెలుగమ్మాయి సుమయ రెడ్డి తన ఆల్ రౌండర్ టాలెంట్ తో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 April 2025 3:00 PM IST
డియర్ ఉమ’ ట్రైలర్.. సమ్ థింగ్ స్పెషల్ అనేలా..
X

తెలుగమ్మాయి సుమయ రెడ్డి తన ఆల్ రౌండర్ టాలెంట్ తో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రైటర్‌గా కథను రాసి, నిర్మాతగా డబ్బు పెట్టి, హీరోయిన్‌గా నటిస్తూ ‘డియర్ ఉమ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదలకాబోతుండగా, ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. శుక్రవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రబృందం మాట్లాడిన మాటలు సినిమాపై మంచి అంచనాలు పెంచాయి.

ఇందులో హీరోగా పృథ్వీ అంబర్ నటించగా, దర్శకత్వం సాయి రాజేష్ మహాదేవ్ వహించారు. ట్రైలర్ చూస్తే సమ్ థింగ్ స్పెషల్ అనేలా ఉంది. హీరో ఒక సింగర్ కావాలని, హీరోయిన్ ఒక డాక్టర్ కావాలని కలలు కంటారు. అయితే ఇద్దరికి ఎదురైన సంఘటనల నేపథ్యంలో కథ నడవనుందని అర్థమవుతోంది. కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణిపై ఓ బలమైన సందేశాన్ని సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్‌ నుంచే స్పష్టమవుతోంది. రధన్ సంగీతం, రాజ్ తోట సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు హైలైట్ కానున్నాయి.

ఈ సందర్భంగా సుమయ రెడ్డి మాట్లాడుతూ.. “ఓ మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను. కథ రాస్తున్నప్పుడు ఎంతో విశ్వాసంతో ముందుకు వెళ్లాను. నిర్మాత దొరకకపోయినా, మా అమ్మ నా వెనుక నిలిచింది. ఇది మా ఫ్యామిలీ టీం వర్క్‌. అందరూ కలసి చేశాం. ఏప్రిల్ 18న మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి” అని పేర్కొన్నారు.

హీరో పృథ్వీ అంబర్ మాట్లాడుతూ.. “తెలుగులో ఇది నా ఫస్ట్ మూవీ. సుమయ మామూలు హీరోయిన్ కాదు. రైటర్, ప్రొడ్యూసర్‌గా కూడా ఎంత కష్టపడారో చూశాను. నాకు ‘దియా’ సినిమా తర్వాత మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మళ్లీ కలవాలన్న ఆశ ఉంది” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రధన్ మాట్లాడుతూ.. “సుమయలో ఉన్న ప్యాషన్ నన్ను ఆకట్టుకుంది. మంచి కంటెంట్‌తో చేసిన సినిమా ఇది. పాటలు, ఆర్ఆర్ అన్నీ బాగా వచ్చాయి. మిగతా టీం కూడా ఎంతో శ్రమించి ఈ సినిమా చేశారని చెప్పగలను. ఏప్రిల్ 18న థియేటర్‌కు రండి.. ‘డియర్ ఉమ’ను చూసి మాకు విజయాన్ని అందించండి” అని కోరారు. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

‘డియర్ ఉమ’ ట్రైలర్.. సమ్ థింగ్ స్పెషల్ అనేలా..