Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ ని దించేసిన వార్న‌ర్..త‌గ్గేదేలే!

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ పుష్ప రీల్స్ తో ఎంత సంచ‌ల‌న‌మయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   11 Jun 2024 10:58 AM GMT
పుష్ప రాజ్ ని దించేసిన వార్న‌ర్..త‌గ్గేదేలే!
X

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ పుష్ప రీల్స్ తో ఎంత సంచ‌ల‌న‌మయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. శ్రీవ‌ల్లి పాట‌కు చాలా మంది ప్లేయ‌ర్లు స్టెప్పులేసారు. కానీ వార్న‌ర్ మూవ్ మెంట్ ని మాత్రం ఎవ‌రూ తీసుకు రాలేక‌పోయారు. అందులో వార్న‌ర్ మంచి సక్సెస్ అయ్యాడు. దీంతో వార్న‌ర్ రోజుకో రీల్ సైతం చేసి నెట్టింట పోస్ట్ చేసాడు. వాటితో మరింత వైర‌ల్ అయ్యాడు. తాజాగా 'పుష్ప‌-2' కూడా రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాలు..బన్నీ గెట‌ప్ప్ ప్ర‌తీది అదిరిపోయింది. ఈనేప‌థ్యంలో తాజాగా వార్న‌ర్ సినిమా రిలీజ్ కి ముందే పుష్ప‌రాజ్ మేనియా పూనిన‌ట్లు క‌నిపిస్తుంది. బ‌న్నీ ప్ల‌స్ వార్న‌ర్ క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే వార్న‌ర్ తో ఓ కంపెనీ యాడ్ చేసింది.వేక్‌ఫిట్ మ్యాట్రెస్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో వార్న‌ర్ పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ పాత్ర‌ను పోషించాడు. బీన్నీ లుక్..ఆహార్యాన్ని ఇలా ట్రై చేసాడు.

మెడ‌లో దుడ్డు చైన్..చేతికి వాచీ..ఐదు వేళ్ల‌కు ఐదు ఉంగ‌రాలు ధ‌రించాడు. అలాగే ధ‌రించిన చొక్కా డిజైన్ కూడా అచ్చంగా పుష్ప‌రాజ్ ని త‌ల‌పించింది. ఫేస్ లో ఇచ్చే ఎక్స్ ప్రెష‌న్ విష‌యంలోనూ ఏమాత్రం తగ్గ‌లేదు. త‌గ్గేదేలే అన్న రేంజ్ లో వార్న‌ర్ బ‌న్నీ లుక్ ని దించేసాడు. దానికి సంబంధించిన యాడ్ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో హిందీలో డైలాగ్‌లు చెప్పాడు.

పుష్ప లెవెల్‌లో ఎడ‌మ చేత్తో త‌గ్గేదేలే అని ఫోజ్ సైతం ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. కంపెనీ పుష్ప ఇమేజ్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటుంది. క్రికెట‌ర్ గా వార్న‌ర్ ప్ర‌పంచ‌మంతా తెలుసు...హీరోగా బ‌న్నీ దేశ‌మంతా తెలుసు. ఆ రెండు ర‌కాల ఇమేజ్ స‌ద‌రు కంపెనీకి క‌లిసొచ్చింద‌నే చెప్పాలి.