Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ స్టాట్యూపై వార్న‌ర్ కామెంట్

ఈ రోజు క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఫోటోని షేర్ చేసాడు. ''ఈ లెజెండ్ ఎంత బాగున్నాడు? అభినందనలు #పుష్ప'' అని క్యాప్షన్ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   29 March 2024 2:10 PM GMT
అల్లు అర్జున్ స్టాట్యూపై వార్న‌ర్ కామెంట్
X

జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ నేడు భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ వాంటెడ్ స్టార్. పుష్ప 1: ది రైజ్ అత‌డి స్థాయిని అమాంతం పెంచింది. ఈ చిత్రంతో చారిత్రక విజయాన్ని సాధించడమే కాకుండా ప్రపంచ స్థాయిలో తనకంటూ ఒక గొప్ప‌ పేరు తెచ్చుకున్నాడు. మునుముందు అల్లు అర్జున్ సూపర్ స్టార్ డమ్ పెరుగుతూనే ఉంటుంది. అల్లు అర్జున్ న‌ట‌న‌, డ్యాన్సుల‌కు ప్ర‌పంచ‌మంతా అభిమానులున్నారు. ఇండస్ట్రీ సెలబ్రిటీల నుంచి క్రికెటర్ల వరకు అల్లు అర్జున్ ని అభిమానించని వారు లేరు.

ఈ గురువారం నాడు అల్లు అర్జున్ మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌లో తన మైనపు విగ్రహాన్ని ప్రారంభించినందున త‌న‌కు ప్రీ బర్త్‌డే బహుమతి లభించిందని ఆనందం వ్య‌క్తం చేసారు. బ‌న్నీకి సినీప్ర‌ముఖుల‌తో పాటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ రోజు క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఫోటోని షేర్ చేసాడు. ''ఈ లెజెండ్ ఎంత బాగున్నాడు? అభినందనలు #పుష్ప'' అని క్యాప్షన్ ఇచ్చాడు.

డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ పై ప్రేమను చూపించడం ఇదే మొదటిసారి కాదు. ఇంత‌కుముందు ప్రపంచ కప్ మ్యాచ్‌ల‌లో పాకిస్థాన్ మ్యాచ్ సంద‌ర్భంగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్ప మేన‌రిజంతో త‌గ్గేదేలే డైలాగ్ చెప్పాడు. అంత‌కుముందు పుష్ప పాట‌ల‌కు అత‌డు చేసిన డ్యాన్సులు కూడా వైర‌ల్ అయ్యాయి.

అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న రోజునే మైనపు విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఈ సంద‌ర్భంగా బ‌న్ని X ఖాతాలో త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసాడు. ఈ గొప్ప మైలురాయిని చేరినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ''ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. నా 1వ చిత్రం #గంగోత్రి ఈరోజు అంటే 2003లో ఇదే తేదీన‌ విడుదలైంది. ఇదే రోజు నేను నా మైనపు విగ్రహాన్ని మ్యాడ‌మ్ తుస్సాడ్స్- దుబాయ్‌లో ప్రారంభిస్తున్నాను. 21 ఏళ్లుగా ఇది మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. నా అభిమానులకు (ఆర్మీ) వారి అపారమైన ప్రేమ & మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరినీ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నాను. ఎవర్ గ్రేట్‌ఫుల్ & హంబుల్డ్'' అని ఎమోష‌న‌ల్ గా రాశాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప : ది రూల్' సినిమాని విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడు బ‌న్ని. ఈ ఏడాది 15 ఆగష్టు 2024 న థియేటర్లలోకి రానుంది. పుష్ప 3 కూడా ఉంటుంద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలు వెలువ‌డ‌డంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.