Begin typing your search above and press return to search.

డేటింగ్ ఈయ‌న‌తో కాదు ఆయ‌న‌తో.. టైమొస్తే చెబుతా: కంగ‌న‌

మ‌రోవైపు క్వీన్ కంగ‌న కొత్త డేటింగ్ గురించి మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   24 Jan 2024 2:41 PM GMT
డేటింగ్ ఈయ‌న‌తో కాదు ఆయ‌న‌తో.. టైమొస్తే చెబుతా: కంగ‌న‌
X

భార‌త‌దేశంలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో కంగనా రనౌత్ ఒకరు. ఇటీవ‌ల‌ వ‌రుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమైనా కానీ న‌టిగా క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా ఉంది. గ‌త ఏడాది విడుద‌లైన చంద్ర‌ముఖి 2 ఆశించిన ఫ‌లితం అందుకోలేదు. చివరి విడుదలైన తేజస్ ఫ‌లితం నిరాశ‌ప‌రిచింది. త‌దుప‌రి `ఎమర్జెన్సీ`లో న‌టిస్తోంది. ఇందులో కంగ‌న‌మాజీ భారత ప్రధాని ఇందిర పాత్రను పోషిస్తోంది.


మ‌రోవైపు క్వీన్ కంగ‌న కొత్త డేటింగ్ గురించి మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల‌ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ లాయిక్ చాపోయిక్స్‌తో డేటింగ్ చేస్తోందంటూ ప్ర‌చారం సాగింది. ఆ ఇద్ద‌రూ చేతులు పట్టుకుని సెలూన్ నుండి నిష్క్రమించడాన్ని చూశాక ఈ ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. ఇటీవల అయోధ్య పవిత్రోత్సవం సందర్భంగా కంగనా అనేక మంది ప్రముఖులతో కలిసి క‌నిపించింది. వారిలో ఒకరు EaseMyTrip వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి. పిట్టితో కంగ‌న‌ ఫోటో కూడా వైరల్ అయ్యింది. ఇంత‌లోనే ఇద్దరూ డేటింగ్ చేస్తున్నార‌ని పుకార్లు వచ్చాయి.

ఈ వార్తలను ప్రచారం చేసినందుకు కంగనా ఇప్పుడు మీడియా పోర్టల్స్‌పై విరుచుకుపడింది. ``మీడియాకు నా వినయపూర్వకమైన అభ్యర్థన.. దయచేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు. నిశాంత్ పిట్టి జీ సంతోషంగా వివాహం చేసుకున్నారు. నేను మరొకరితో డేటింగ్ చేస్తున్నాను.. సరైన సమయం కోసం వేచి ఉండండి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి`` అని కంగనా సోష‌ల్ మీడియాలో క్లారిటీనిచ్చింది. ఎవ‌రైనా ఒక యువతిని ప్రతిరోజూ కొత్త వ్యక్తికి లింక్ చేయడం మంచిది కాదు.. వారు కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన ఇలాంటి ప్ర‌చారం చేయ‌కండి.. అని కంగ‌న సూచించింది.