Begin typing your search above and press return to search.

దసరా ఫైట్ లో ఎవరెవరు..? క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?

సమ్మర్ రేసు నుంచి స్టార్ సినిమాలు తప్పుకోవడం వల్ల సమ్మర్ మొత్తం యువ హీరోల సినిమాలకు మంచి అవకాశం దొరికింది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 1:30 PM GMT
దసరా ఫైట్ లో ఎవరెవరు..? క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?
X

స్టార్ సినిమాల రిలీజ్ వ్యవహారం నిర్మాతల మండలికి పెద్ద హెడేక్ గా మారింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు థియేటర్ల సర్ధుబాటు కోసం నానా తంటాలు పడ్డారు. ఇక ఆ ఫైట్ ముగిసింది అనుకుంటే సమ్మర్ సినిమాలు రెడీ అయ్యాయి. అయితే సమ్మర్ కి అనుకున్న పెద్ద సినిమాలు రాకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు. ప్రభాస్ కల్కి మే 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా వాయిదా వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నా ఆ టైం కు చెబుతారని టాక్. సంక్రాంతి తర్వాత ఒకేసారి కాకపోయినా సమ్మర్ లో స్టార్ సినిమాల ఫైట్ రసవత్తరంగా ఉంటుందని అనుకున్నారు.

సమ్మర్ రేసు నుంచి స్టార్ సినిమాలు తప్పుకోవడం వల్ల సమ్మర్ మొత్తం యువ హీరోల సినిమాలకు మంచి అవకాశం దొరికింది. అయితే సమ్మర్ లో ఉండాల్సిన ఫైట్ కాస్త దసరాకి షురూ అయ్యేలా ఉందని తెలుస్తుంది. ఏప్రిల్ నుంచి వాయిదా పడుతున్న ఎన్.టి.ఆర్ దేవర కచ్చితంగా దసరా బరిలో దిగుతాడని టాక్. రెండు భాగాలుగా వస్తున్న దేవర మొదటి పార్ట్ దసరాకి దాదాపు ఫిక్స్ అన్నట్టే లెక్క.

చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా కూడా దసరాకి రిలీజ్ అంటున్నారు. సినిమా నిర్మాత దిల్ రాజు కాబట్టి పండుగ సీజన్ ని వదిలి పెడతాడని అనుకోలేం. సో దసరాకి దేవర వచ్చినా సరే చరణ్ గేమ్ చేంజర్ ఫైటింగ్ కి రెడీ అనేలా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఆగష్టు 15న రిలీజ్ అనుకున్న పుష్ప 2 ఒకవేళ వాయిదా పడితే అది కూడా దసరాకే రిలీజ్ టార్గెట్ పెట్టేలా ఉన్నారు. ఎన్.టి.ఆర్, చరణ్ తో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కూడా పోటీకి దిగే పరిస్థితి ఉండనే ఉంది.

మరోపక్క ఇటు సంక్రాంతికే కాదు దసరాకి వచ్చిన బాలకృష్ణ సినిమాలు సక్సెస్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ దసరాకి వచ్చిన భగవంత్ కేసరి హిట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ తో బాలయ్య బాబీ కాంబో సినిమా కూడా దసరాకి రిలీజ్ అన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీటితో పాటుగా మంచు విష్ణు భారీ బడ్జెట్ తో చేస్తున్న కన్నప్ప కూడా దసరాకి రిలీజ్ ఫిక్స్ అంటున్నారు.

తెలుగు సినిమాలే కాదు దసరా అనగానే కోలీవుడ్ డబ్బింగ్ సినిమాల తాకిడి ఉంటుంది. లాస్ట్ ఇయర్ దళపతి విజయ్ లియో వచ్చింది. ఈసారి సూపర్ స్టార్ రజిని వెట్టయన్ కూడా దసరాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలుగు సినిమాల మధ్య రజనీ సినిమా ఏమేరకు పోటీ ఇవ్వగలదు అన్నది ఆలోచించాలి. ఒకవేళ కల్కి సమ్మర్ వాయిదా పడితే దసరానే నెక్స్ట్ టార్గెట్ అని అంటున్నారు. అలా అయితే దసరా ఫైట్ మరింత టఫ్ గా మారుతుంది. స్టార్స్ అంతా దసరా కే రిలీజ్ పెట్టుకుంటే మాత్రం కష్టమే అని చెప్పొచ్చు. ఇంతకీ దసరాకి ఏయే సినిమాలు వస్తాయి.. క్లారిటీ ఎప్పుడు ఇస్తారని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. మరి త్వరలోనే వీటికి ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి.