Begin typing your search above and press return to search.

బాలయ్య vs రవితేజ.. విజయ్ తట్టుకుంటాడా?

ఈ రెండు సినిమాలపైన మంచి బజ్ ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల స్పందన కూడా గట్టిగానే ఉంది. అయితే ఈ సినిమాలతో పాటుగా ఇళయదళపతి విజయ్ లియో మూవీ కూడా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.

By:  Tupaki Desk   |   3 Oct 2023 11:30 PM GMT
బాలయ్య vs రవితేజ.. విజయ్ తట్టుకుంటాడా?
X

దసరాకి వారం రోజుల పాటు పండగ సెలవులు దొరుకుతున్నాయి. సంక్రాంతి తర్వాత తెలుగు రాష్ట్రాలలో చేసుకునే అతి పెద్ద పండుగలలో దసరా ఒకటి. అందుకే ఈఫెస్టివల్ టైంని కరెక్ట్ గా యూజ్ చేసుకోవడానికి స్టార్ హీరోలు తమ సినిమాలని బరిలోకి దించుతూ ఉంటారు. ఈ సారి దసరా బరిలో టాలీవుడ్ నుంచి రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భగవంత్ కేసరి మూవీ అక్టోబర్ 19న థియేటర్స్ లోకి వస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 20 ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ రెండు సినిమాలపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రవితేజ టైగర్ రియల్ లైఫ్ రాబిన్ హుడ్ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో తెరకెక్కుతోంది.

ఇక బాలయ్య మూవీలో రావిపూడి స్టైల్ ఎంటర్టైన్మెంట్ తో పాటుగా బాలకృష్ణ స్టైల్ మాస్ అంశాలు పుష్కలంగా ఉండే కమర్షియల్ మూవీగా రాబోతోంది. ఈ రెండు సినిమాలపైన మంచి బజ్ ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల స్పందన కూడా గట్టిగానే ఉంది. అయితే ఈ సినిమాలతో పాటుగా ఇళయదళపతి విజయ్ లియో మూవీ కూడా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.

తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రిలీజ్ చేయనున్నారు. తెలుగు రైట్స్ ని భారీ ధరకి సొంతం చేసుకున్నారు. అయితే ఈ రెండు పెద్ద సినిమాల మధ్య లియో మూవీ ఏ మేరకు ఆడియన్స్ అటెన్సన్ గ్రాబ్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే లోకేష్ కనగరాజ్ గత సినిమాలు తెలుగులో కూడా మంచి కమర్షియల్ హిట్ అయ్యాయి. దీంతో లియో మీద కూడా బజ్ ఉంది.

గతం శుక్రవారం వచ్చిన సినిమాలు పూర్తిగా తేలిపోయాయి. అక్టోబర్ 6న రిలీజ్ కాబోయే సినిమాలు కూడా లాంగ్ రన్ ఏ మేరకు ప్రభావం చూపిస్తయనేది చెప్పలేని విషయం. ఈ నెలలో దసరా బరిలో రిలీజ్ కాబోయే ఈ మూడు సినిమాలపైనే ఆడియన్స్ అటెన్సన్ అంతా ఉంది. మరి వీటిలో ఏది బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవుతుందనేది వేచి చూడాలి.