Begin typing your search above and press return to search.

దసరా కాంబో హీరోయిన్ కూడా రిపీటా..?

అయితే హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాత్రమేనా దసరా హీరోయిన్ కీర్తి సురేష్ ని కూడా రిపీట్ చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   31 March 2024 4:34 AM GMT
దసరా కాంబో హీరోయిన్ కూడా రిపీటా..?
X

పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో న్యాచురల్ స్టార్ నాని చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాయి.. అయితే కెరీర్ లో ముందుకు సాగాలంటే రిస్క్ చేయక తప్పదు ఆ విషయంలో పర్ఫెక్ట్ క్లారిటీ ఉన్న నాని సినిమాల సెలక్షన్ లో తన క్లవర్ నెస్ చూపిస్తుంటాడు. అందుకే మిగతా హీరోల కన్నా తన సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కడో ఒకచోట నాని కేవలం ఇలాంటి సినిమాలే చేయగలడు అన్న టాక్ అయితే ఉంది. దానికి సమాధానం ఇవ్వాలనే నాని దసరా సినిమా చేశాడు.

నూతన దర్శకుడితో నాని చేసిన దసరా సినిమా నాని ఫ్యాన్స్ కే కాదు ఆడియన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ధరణి పాత్రలో నాని చూపించిన మాసిజం వారెవా అనిపించేలా చేసింది. దసరాతో కెరీర్ లో మరో మెట్టు ఎక్కిన నాని 100 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు. దసరా తర్వాత మళ్లీ తన మార్క్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా హాయ్ నాన్న తీశాడు. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్న నాని మరోసారి దసరా కాంబో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు.

దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతోనే నాని 33వ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. దసరా హీరో డైరెక్టర్ మాత్రమే కాదు నిర్మాత కూడా సుధాకర్ చెరుకూరి కూడా వీరితో చేతులు కలుపుతున్నారు. దసరా తర్వాత ఈసారి అంతకుమించి అనిపించే సినిమాతో నాని వస్తున్నాడని తన అనౌన్స్ మెంట్ తోనే అర్థమవుతుంది. అయితే హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ మాత్రమేనా దసరా హీరోయిన్ కీర్తి సురేష్ ని కూడా రిపీట్ చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

నాని సినిమా అంటే కీర్తి సురేష్ ఏమాత్రం నో చెప్పే ఛాన్స్ లేదు. అందులోనూ దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడ్డాక డైరెక్టర్ మీద కచ్చితంగా నమ్మకం ఉంటుంది. దసరా సినిమాలో వెన్నెల పాత్రలో మహానటి గా తన మార్క్ చూపించిన కీర్తి సురేష్ రాబోయే ఈ సినిమాలో కూడా భాగం అవుతుందా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న నాని మాస్ రాంపేజ్ లో భాగంగా దసరా కాంబో మరో సినిమా చేయడం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. దసరా కాంబో సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అన్నారంటే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.