Begin typing your search above and press return to search.

నాని హిట్ కాంబో రిపీట్.. ఈసారి అంతకుమించి?

ఇక ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమాను దసరా నిర్మాత సుధాకర్ చెరుకురి నిర్మించబోతున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   18 Jan 2024 3:30 PM GMT
నాని హిట్ కాంబో రిపీట్.. ఈసారి అంతకుమించి?
X

నేచురల్ స్టార్ నాని తన ప్రతి సినిమాకు కూడా ఏదో ఒక కొత్త తరహా కథను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అలాగే ఇటీవల కాలంలో నాని యాక్టింగ్ పరంగానే కాకుండా తన లుక్స్ తో కూడా సరికొత్తగా మెస్మరైజ్ చేస్తూ ఉన్నాడు. గత ఏడాది వచ్చిన దసరా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మొదటిసారి కంప్లీట్ గా తన మేకవర్ చేంజ్ చేసుకున్న నాని మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గర అయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకోవడంతో నాని తదుపరి సినిమాలపై అంచనాలు అయితే పెరిగాయి. కానీ నాని మాత్రం కంటెంట్ పరంగా తన సినిమాలను హైలెట్ చేస్తూ వెళుతూ ఉన్నాడు. దసరా తర్వాత వచ్చిన హాయ్ నాన్న పర్వాలేదు అనే విధంగా సక్సెస్ అందుకుంది.

అయితే ఒక పాన్ ఇండియా మాస్ సినిమా తర్వాత నాని అంత క్లాస్ ఎమోషనల్ సినిమాతో వస్తాడు అని ఎవరు అనుకోలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ నాని హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. నాని దసరా దర్శకుడు శ్రీకాంత్ మరో కొత్త తరహా కథను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమాను దసరా నిర్మాత సుధాకర్ చెరుకురి నిర్మించబోతున్నట్లు సమాచారం.

నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల తన సెకండ్ సినిమాను మరొక హీరో తో చేయాలని ఆ మధ్య ప్రయత్నాలు చేశాడు. అంతే కాకుండా అఖిల్ అక్కినేని తో కూడా చర్చలు జరిపారు. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. ఇక మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి దర్శకుడు నాని వైపు యూ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక నాని కూడా శ్రీకాంత్ చెప్పిన మరో కొత్త కథ విషయంలో పెద్దగా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అంతేకాకుండా దసరా కంటే హై రేంజ్ లో మరొక డిఫరెంట్ హై వోల్టేజ్ సినిమాను ఈ కాంబినేషన్ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే ఒక ప్రముఖ దర్శకుడితో కూడా నాని సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ అది సెట్ అయితే శ్రీకాంత్ ప్రాజెక్టు కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కుదరకపోతే శ్రీకాంత్ ప్రాజెక్టు పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో.