Begin typing your search above and press return to search.

మ‌ర్డ‌ర్ కేసులో అరెస్ట్ అయిన న‌టుడిపై న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం!

అభిమాని రేణుకా స్వామి హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ బెయిల్ పై బ‌య‌ట కొచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 April 2025 2:57 PM IST
మ‌ర్డ‌ర్ కేసులో అరెస్ట్ అయిన న‌టుడిపై న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం!
X

అభిమాని రేణుకా స్వామి హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ బెయిల్ పై బ‌య‌ట కొచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టు విచార‌ణ‌లో ఉంది. తాజాగా మంగ‌ళ‌వారం విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన ద‌ర్శ‌న్ గౌర్హాజ‌రయ్యాడు. న‌డుము నొప్పి కార‌ణంగా విచార‌ణ‌కు హాజ‌రు కాలేక‌పోయాడంటూ ద‌ర్శ‌న్ త‌రుపు లాయ‌ర్, న్యాయ‌మూర్తి ముందు ఉంచారు. దీంతో న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

కేసు విచార‌ణ స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో కోర్టులో ఉండాల‌ని ఇలాంటి సాకులు చెప్పి ఢుమ్మా కొట్ట‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే ద‌ర్శ‌న్ బెంగుళూరులోని ఓ సినిమా ఈవెంట్ కు హాజ‌రైన ఫోటోలు..వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో ఎలాంటి అసౌక‌ర్యానికి గురి కాకుండా ఎంచ‌క్కా కుర్చుని ఉన్నాడు. ఈవెంట్ అనంత‌రం మీడియాతో కూడా మాట్లాడాడు. ఇది చూసిన నెటి జ‌నులు ద‌ర్శ‌న్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

కోర్టు విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా సినిమా ఈవెంట్ల‌కు హాజ‌రు కావ‌డం ఏంట‌ని మండి ప‌డుతున్నారు. కోర్టు...కేసు అంటే ద‌ర్శ‌న్ కు అంత చుల‌క‌న‌గా ఉందా? అంటూ అత‌డిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకో వాలంటూ ఆగ్రహం చెందుతున్నారు. రేణుకా స్వామి హ‌త్య కేసులో ద‌ర్శ‌న్ కొన్ని నెల‌లు పాటు జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. పలుమార్లు బెయిల్ పిటీష‌న్లు తిర‌స్క‌ర‌ణ అనంత‌రం రాక రాక బెయిల్ వ‌చ్చింది.

ఈ కేసులో ప్ర‌ధాన నిందుతురాలిగా న‌టి ప‌విత్రా గౌడ్ ఉన్నారు. ఆమెతో పాటు మ‌రో 15 మంది కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్నారు. ప్ర‌స్తుతం అంద‌రూ బెయిల్ పై బ‌య‌ట ఉన్నారు. రేణుకాస్వామి ప‌విత్రా గౌడ్ ను అస‌భ్య మెసెజ్ లు...వీడియోలు పంపించి లైంగికంగా వేధించాడ‌నే కార‌ణంగా హ‌త్య చేసిన‌ట్లు వీరంతా ఆరోప‌ణ‌లు ఎదుర్కోంట‌న్న సంగ‌తి తెలిసిందే.