ఆ కన్నడ సంచలనం మళ్లీ మ్యాకప్!
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఏ2 గా ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపిన దర్శన్ ఆ మధ్య బెయిల్ పై బయటకొచ్చాడు.
By: Tupaki Desk | 7 July 2025 9:00 PM ISTఅభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఏ2 గా ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపిన దర్శన్ ఆ మధ్య బెయిల్ పై బయటకొచ్చాడు. అనతరం కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో గడిపాడు. కుటుంబం, స్నేహితుల్ని తప్ప ఇంకెవర్నీ కలవలేదు. దీంతో దర్శన్ జైలు జ్ఞాపకాల నుంచి బయటపడినట్లు కనిపిస్తోంది. మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. కొత్త సినిమాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు కన్నడ మీడియాలో ప్రచారం మొదలైంది.
దర్శన్ అరెస్ట్ అవ్వడంతో 'ది డెవిల్' షూటింగ్ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ సినిమా తిరిగి ప్రారంభం కాలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పున ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే దర్శన్ ఇంకా సెట్స్ కు హాజరుకానట్లు తెలుస్తోంది. త్వరలోనే అతడు హాజరవుతాడని సమాచారం. అలాగే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నిర్మాతలు, దర్శకులతో కూడా దర్శన్ ఈ మధ్య భేటీ అవుతున్నాడట. కొత్త కథలు వింటున్నట్లు సమాచారం. అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలకు డేట్లు కూడా కేటాయించాలని చూస్తున్నాడట.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. మర్డర్ కేసులో ఏ 2 నిందితుడుగా ఉన్న దర్శన్ తో సినిమాలేంటి? అతడిని ఇంకా ప్రోత్సహించాలా? అని పోస్టులు పెడుతున్నారు. అభిమాని పైనే కర్కశ చర్యకు దిగిన అలాంటి నటులకు అభిమానులు ఉండటం దురదృష్టకరమంటూ మండిపడుతున్నారు కొందరు. మరి ఈ నెగివిటీని దర్శన్ ఎలా తీసుకుంటాడు? అన్నది చూడాలి.
మరి ఇలాంటి వ్యతిరేకత మధ్య దర్శన్ సినీ ప్రయాణం ఎలా కొనసాగుతుంది? అన్నది ఆసక్తికరమే. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కన్నడలో పెద్ద స్టార్. అతడితో నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తుంటారు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కానీ ఆవేశంలో ప్రియురాలి కోసం చేసిన ఘాతుకంతో దర్శన్ జీవితమే తల్లకిందులైంది. వృత్తి.. వ్యక్తిగతంగా ఎంతో డ్యామేజ్ జరిగింది.
