Begin typing your search above and press return to search.

డార్లింగ్ బ‌ర్త్ డేకి ట్రిపుల్ ట్రీట్ !

ఇక మ‌రో ప‌ది రోజుల్లో ఎలాగూ పుట్టిన రోజు కూడా వ‌స్తుంద‌నేమో ఏకంగా మ‌రోసారి విదేశాల్లోనే ఆవేడుక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌న్నిహితుల నుంచి తెలిసింది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 9:32 AM GMT
డార్లింగ్ బ‌ర్త్ డేకి ట్రిపుల్ ట్రీట్ !
X

డార్లింగ్ ప్ర‌భాస్ బ‌ర్త్ డే అంటే అభిమానుల‌కు పండ‌గే. ఏదో స్పెష‌ల్ ఉంటుంద‌ని ఆశిస్తారు. అందులోనూ ఈసారి ఏకంగా మూడు సినిమాలు సెట్స్ లో ఉండ‌టంతో ట్రీట్ ఇంకా స్పెష‌ల్ గా ఉంటుంద‌ని భావిస్తు న్నారు. మరి డార్లింగ్ ఆ ర‌కంగా షురూ చేస్తాడా? అంటే అవ్వ‌డానికి ఛాన్సెస్ ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. ఈనెల 23 డార్లింగ్ బ‌ర్త్ డే. ప్ర‌స్తుతం డార్లింగ్ వ‌య‌సు 43... అక్టోబ‌ర్ 23 తో 44వ వ‌సంతంలో కి అడుగు పెడ‌తాడు.

అందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈసారి కూడా డార్లింగ్ విదేశాల్లోనే పుట్టిన రోజు వేడుక‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్ నుంచి త‌న స్నేహితులంతా 23 క‌ల్లా ఫారిన్ లో ఉండే లా ప్లాన్ చేసుకుంటున్నారుట‌. కొన్ని రోజులుగా ప్ర‌భాస్ విదేశాల్లోనే ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. స‌ర్జ‌రీ నిమిత్తం విదేశాలు వెళ్లిన ప్ర‌భాస్ విశ్రాంతి లో భాగంగా అక్క‌డే ఉన్నారు. ప్ర‌స్తుతం ఆరోగ్యం...స‌ర్జ‌రీ అంతా స‌క్సెస్ పుల్ గా ఉన్నా! హైద‌రాబాద్ కి మాత్రం తిరిగిరాలేదు.

ఇక మ‌రో ప‌ది రోజుల్లో ఎలాగూ పుట్టిన రోజు కూడా వ‌స్తుంద‌నేమో ఏకంగా మ‌రోసారి విదేశాల్లోనే ఆవేడుక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌న్నిహితుల నుంచి తెలిసింది. ఈనేప‌థ్యంలో ఆయ‌న న‌టిస్తోన్న సినిమా అప్ డేట్లు కూడా ఆరోజు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. బ‌ర్త్ డే కాబ‌ట్టి మూడు సినిమాల నుంచి అభిమానుల్ని అల‌రించేలా ప్ర‌చార చిత్రాలు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

మారుతి సినిమాకి సంబంధించి కచ్చితంగా ఏదో స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని అంటున్నారు. అలాగే 'స‌లార్' రిలీజ కి రెడీ అయినా ఇంత‌వ‌ర‌కూ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌లేదు. అటుపై వాయిదాల ప‌ర్వం తెలిసిందే. బ‌ర్త్ డేకి అభిమానుల‌కు ట్రీట్ ఇవ్వాల‌నే ఉద్దేశంతో ట్రైల‌ర్ ఆరోజు రిలీజ్ చేసే అవ‌కాశం ఉందంటు న్నారు. అలాగే 'క‌ల్కి' నుంచి స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. మ‌రి ఫ్యాన్స్ ఆశ‌లు తీరుస్తారా? లేదా? అన్న‌ది ఆ ముందు రోజు తెలిసిపోతుంది. ఇంత‌వ‌ర‌కూ ఈ మూడు సినిమాల‌కు సంబంధించి ఎలాంటి ప్ర‌చారం చిత్రం రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌నైతే లేదు.