Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ విలన్ మృతి

అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి చనిపోయినట్లు తెలుస్తోంది. గతంలోనే ఆయన కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యారు.

By:  Tupaki Desk   |   30 March 2024 3:53 AM GMT
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ విలన్ మృతి
X

కోలీవుడ్ లో డానియల్ బాలాజీ అంటే తెలియని వారు ఉండరు. అలాగే వెంకటేష్ ఘర్షణ, రామ్ చరణ్ చిరుత, నాని టక్ జగదీశ్ సినిమాలలో ప్రధాన పాత్రలో నటించిన నటుడు అంటే తెలుగు ఆడియన్స్ వెంటనే గుర్తుపడతారు. నటుడిగా మంచి గుర్తింపు అందుకున్న బాలాజీ గుండెపోటుతో మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం ఆయనకి గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి చనిపోయినట్లు తెలుస్తోంది. గతంలోనే ఆయన కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యారు. మళ్ళీ సెంటనే కోలుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు హఠాత్తుగా చనిపోవడం అందరిని షాక్ కు గురి చేసింది. నటుడిగా భిన్నమైన పాత్రలతో సౌత్ ఇండియన్ ఆడియన్స్ కి డానియల్ బాలాజీ చేరువ అయ్యారు.

డానియల్ బాలాజీ ఏప్రిల్ మాదతిల్ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే అతను నెగిటివ్ షేడ్స్ తో ఆకట్టుకున్న విధానం ప్రముఖ దర్శకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. తరువాత వరుస సినిమాలు చేశాడు. కాక్కా కాక్కా మూవీలో సూర్య టీమ్ లో ఒకడిగా కనిపించిన డానియల్ బాలాజీ తరువాత కమల్ హాసన్ రాఘవన్ చిత్రంలో సైకో విలన్ గా నటించి మెప్పించాడు.

తెలుగులోలోకి ఎన్టీఆర్ సాంబ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తరువాత ఘర్షణ, చిరుత, సాహసం శ్వాసగా సాగిపో టక్ జగదీశ్ చిత్రాలలో నటించాడు. నాని హీరోగా చేసిన టక్ జగదీశ్ కమర్షియల్ గా ఫెయిల్ అయిన డానియల్ బాలాజీకి మంచి పేరు తీసుకొచ్చింది. తరువాత మళ్ళీ తెలుగులో మూవీ చేయలేదు. చివరిగా గత ఏడాది తమిళంలో అరియాన్ సినిమాలో బాలాజీ నటించాడు.

డానియల్ బాలాజీ తమ్ముడు అధర్వ మురళీ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్నాడు. తెలుగులో గద్దలకొండ గణేష్ చిత్రంలో నటించాడు. డానియల్ బాలాజీ కజిన్ బ్రదర్ మురళీ తమిళ్, కన్నడ భాషలలో హీరోగా రాణించారు. అతను కూడా 46 ఏళ్ళ వయస్సులో చనిపోయారు. ఇప్పుడు డానియల్ బాలాజీ 48 ఏళ్ళ వయస్సులోనే మృతి చెందారు.

ఆయన మరణంపై కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయనకి నివాళి అర్పించింది. శనివారం డానియల్ బాలాజీ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సినీ ప్రముఖులు అందరూ డానియల్ బాలాజీని మృతదేహాన్ని చూడటానికి ఆయన స్వగృహానికి వెళ్లనున్నారు. నేచురల్ స్టార్ నాని కూడా బాలాజీ మృతిపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.