12 ఏళ్లకే హిస్టరీ క్రియేట్.. 19 ఏళ్లకే అరుదైన వ్యాధితో మృతి!
ఇకపోతే ఆమె మరణించి ఈ ఏడాదికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్లీ అభిమానులు ఆమెను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.
By: Madhu Reddy | 23 Feb 2026 6:54 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలు అభిమానులను తీవ్ర దుఃఖానికి గురిచేస్తున్నాయి.. 12 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసి.. 19 ఏళ్లకే అరుదైన వ్యాధితో ఒక నటి మరణించడాన్ని సినిమా సెలబ్రిటీలే కాదు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే ఆమె మరణించి ఈ ఏడాదికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్లీ అభిమానులు ఆమెను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన దంగల్ సినిమాలో చిన్నప్పటి బబిత పాత్రలో నటించి.. అందరి దృష్టిని ఆకట్టుకున్న బాల నటి సుహాని భట్నాగర్.
అయితే ఈ విషయాన్ని గతంలోనే అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ధ్రువీకరించింది. సుహాని మృతిపై విచారం వ్యక్తం చేస్తూ.. "మనల్ని సుహాని విడిచి వెళ్లిపోయిందన్న వార్త తీవ్రంగా కలిచివేస్తోంది . ఆమె తల్లి పూజ, ఇతర కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అద్భుతమైన ప్రతిభ కలిగిన అమ్మాయి.. ఆమె లేకుండా దంగల్ అసంపూర్ణం.. ఆమె మా గుండెల్లో ఎప్పటికీ ఒక ధ్రువ తారలా వెలుగుతూనే ఉంటుంది " అంటూ రెండేళ్ల క్రితమే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
అయితే 19 ఏళ్లకే సుహాని భట్నాగర్ మరణించడానికి గల కారణంపై ఆమె తండ్రి మాట్లాడుతూ.." సుహానీ మరణించడానికి రెండు నెలల ముందే ఆమె చేయి వాచింది .ఇది మామూలు విషయం అనుకున్నా.. ఆ తర్వాత కొన్ని రోజులకు రెండో చెయ్యి కూడా వాపు రావడం.. ఆ తర్వాత శరీరం అంతా వాచిపోవడంతో వెంటనే వైద్యులను సంప్రదించాము. అలా ఎందుకు అయ్యిందో వారికి కూడా అంత చిక్కగా ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించాము. పలు రకాల పరీక్షలు చేసిన తర్వాత డెర్మటోమయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీనికి స్టెరాయిడ్స్ మాత్రమే చికిత్స.. వైద్యుల సూచన మేరకు ఆమె స్టెరాయిడ్స్ తీసుకున్న మందు ప్రభావానికి శరీరం తట్టుకోలేకపోయింది. నెమ్మదిగా ఆరోగ్యం క్షీణించింది. క్రమంగా వ్యాధి నయం అవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపినా.. చివరికి సుహానీ శరీరం ఇన్ఫెక్షన్ కి గురై శ్వాస తీసుకోవడంలో కష్టం ఏర్పడి.. ఫిబ్రవరి 16 2024న సాయంత్రం సుహాని కన్నుమూసిందని" ఆమె తండ్రి కన్నీరు మున్నీరయ్యారు.
ఇకపోతే చిన్నప్పటి నుంచే మోడలింగ్ చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది. ఇక ఆ కోరికతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ఎంచుకుంది. అందులో భాగంగానే దంగల్ సినిమాకి 20వేల మందికి పైగా చిన్నారుల నుంచి దరఖాస్తులు రాగా అన్ని టెస్టులు పాసై ఎంపికైంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలోనే ఆమె తుది శ్వాస విడిచింది. ఇకపోతే చదువు పూర్తయిన వెంటనే సినిమాల్లోకి వెళ్లాలనుకుంది కానీ దేవుడు ఆమె రాతను మార్చేసి అసలు భూమి మీద లేకుండా ఆమెను తీసుకెళ్లిపోయారు.. ఏది ఏమైనా సుహాని లాంటి ఒక గొప్ప ఆర్టిస్టు నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. ఇక ఈమె మరణానికి రెండు సంవత్సరాలు.. ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మ శాంతించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
