Begin typing your search above and press return to search.

దిల్ రాజు తర్వాత దానయ్యకి ఆ క్రెడిట్‌...!

తమిళ్ సూపర్ స్టార్ విజయ్‌ తో సినిమాలను నిర్మించేందుకు అక్కడి బడా నిర్మాణ సంస్థలు అన్నీ కూడా పోటీ పడుతూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   23 Jan 2024 5:43 AM GMT
దిల్ రాజు తర్వాత దానయ్యకి ఆ క్రెడిట్‌...!
X

తమిళ్ సూపర్ స్టార్ విజయ్‌ తో సినిమాలను నిర్మించేందుకు అక్కడి బడా నిర్మాణ సంస్థలు అన్నీ కూడా పోటీ పడుతూ ఉంటాయి. వంద కోట్ల పారితోషికం అయినా కూడా పర్వాలేదు అన్నట్లుగా విజయ్‌ వెంట ఎప్పుడూ నిర్మాతలు పడుతూనే ఉంటారు. అలాంటి విజయ్ తో దిల్ రాజు ఇప్పటికే ఒక సినిమాను నిర్మించాడు.

తెలుగు నిర్మాతలతో విజయ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఒక వైపు కోలీవుడ్ నిర్మాతలు అంతగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా టాలీవుడ్ నిర్మాతలకి విజయ్‌ డేట్లు ఇచ్చేందుకు రెడీ అవ్వడం విడ్డూరంగా ఉంది. తాజాగా మరో తెలుగు నిర్మాణ సంస్థతో కలిసి సినిమా ను చేసేందుకు విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.

గతంలో దిల్‌ రాజు బ్యానర్‌ లో చేసిన సినిమా తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే మరోసారి తెలుగు బ్యానర్ లో చేసేందుకు విజయ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఆ నిర్మాణ సంస్థ ఏంటి అనేది అధికారికంగా క్లారిటీ రాలేదు... కానీ సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 'ఆర్‌ఆర్‌ఆర్‌' నిర్మాత దానయ్యకి విజయ్‌ డేట్లు దక్కాయట.

దానయ్య ప్రస్తుతం వరుసగా పెద్ద సినిమాలను నిర్మిస్తూ ఉన్నాడు. అదే సమయంలో చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ సమయంలో విజయ్ తో సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. దానయ్య కాంపౌండ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో 'గోట్‌' అనే సినిమాను చేస్తున్న విజయ్ తన తదుపరి సినిమా గా దానయ్య బ్యానర్ లో చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా సెట్స్ పైకి వెళ్లే విధంగా చర్చలు జరుగుతున్నాయి.

విజయ్ 69 సినిమా దర్శకుడు ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తే కచ్చితంగా పాన్‌ ఇండియా రేంజ్‌ లో మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాను నిర్మించిన బ్యానర్‌ లో విజయ్ సినిమా అంటూ పెద్ద ఎత్తున పబ్లిసిటీ దక్కే అవకాశం ఉంది.