Begin typing your search above and press return to search.

విజయ్ ను వదిలించుకోవడమే బెటర్!

ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గోట్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 April 2024 11:03 AM GMT
విజయ్ ను వదిలించుకోవడమే బెటర్!
X

ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గోట్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో టైం ట్రావెల్ కథతో ఈ సినిమా సిద్ధం అవుతోంది. మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత విజయ్ తన చివరి సినిమా చేయబోతున్నారు. విజయ్ తమిళ రాజకీయాలలో బిజీ కావడానికి సిద్ధం అవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పెట్టి తన కార్యాచరణని విజయ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్ చివరి చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా కోసం విజయ్ కి ఏకంగా 200 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా దానయ్య సిద్ధం అయ్యారని చాలా రోజులుగా టాక్ వినిపిస్తోంది. అలాగే భారీ బడ్జెట్ తో మూవీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. విజయ్ కూడా దానయ్య నిర్మాణంలో మూవీ చేయడానికి అగ్రిమెంట్ చేసేశారు.

ఈ సినిమా కోసం టాలీవుడ్ దర్శకుడిని తీసుకోవాలని దానయ్య ప్రయత్నం చేశారు. అయితే విజయ్ మాత్రం హెచ్ వినోత్ ని డైరెక్టర్ గా ఖరారు చేశారు. దాంతో పాటుగా 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే మూవీ బడ్జెట్ లెక్కలు వేసుకుంటే 400 కోట్లకి పైగా అవుతోందంట. విజయ్ ఇమేజ్ పరంగా చూసుకుంటే అతనికి మేగ్జిమమ్ మార్కెట్ తమిళనాడులోనే ఉంది.

తెలుగు రాష్ట్రాలలో అంతంత మాత్రమే. అలాగే నార్త్ ఇండియాలో చెప్పుకోదగ్గ మార్కెట్ లేదు. ఓవర్సీస్ లో కొంత పర్వాలేదు. అయితే రెమ్యునరేషన్ ముందు అనుకున్నదానికంటే పెంచడంతో పాటు బడ్జెట్ కూడా పరిధులు దాటిపోవడం వలన డివివి దానయ్య ఈ సినిమా నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకున్నారంట. దీంతో ఇప్పుడు విజయ్ వేరొక ప్రొడ్యూసర్ ని వెతుక్కునే పనిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

కోలీవుడ్ లో విజయ్ తో మూవీస్ చేయడానికి బడా నిర్మాతలు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అయితే లియో మూవీ డిస్టిబ్యూటర్స్ కి కొంత నష్టం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పరిమితులు చూసుకొని విజయ్ తో మూవీ చేయాలని కోలీవుడ్ బడా నిర్మాతలు అనుకుంటున్నారు. అలాగే విజయ్ అడుగుతున్న 200 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి ముందుకి రాకపోవచ్చు. 150 కోట్ల వరకు డీల్ సెట్ అయ్యేలా చర్చిస్తున్నట్లు సమాచారం.

ఏదేమైనా RRR నిర్మాత దానయ్య విజయ్ తో ఆ స్థాయిలో రిస్క్ చేయడం కంటే తప్పుకోవడమే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే విజయ్ పొలిటికల్ పేరుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. సినిమాపై ఏమాత్రం ప్రభావం పడినా మొదటికే మోసం వస్తుంది. కాబట్టి విజయ్ తో రిస్క్ చేయడం కంటే మిగతా స్టార్ హీరోలకు ఎవరికైనా 100 కోట్ల కంటే తక్కువ జీతం ఇచ్చి రెండు సినిమాలతో మంచి బిజినెస్ చేసుకోవచ్చు. మరి ఫైనల్ గా విజయ్ చివరి చిత్రం ఎవరితో ఖరారవుతుందనేది వేచి చూడాలి.