Begin typing your search above and press return to search.

ఆగష్టులో నాని.. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్..!

న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న సరిపోదా శనివారం డిఫరెంట్ కాన్సెప్ట్ తో నాని మార్క్ కంటెంట్ ఉన్న సినిమాగా వస్తుంది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 9:56 AM GMT
ఆగష్టులో నాని.. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్..!
X

RRR తర్వాత డివివి దానయ్య ఓ పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తుండగా మరోపక్క న్యాచురల్ స్టార్ నానితో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ లు కన్ఫర్మ్ చేసింది డివివి ఎంటర్టైన్మెంట్స్. నాని సినిమాను ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా.. పవన్ కళ్యాణ్ ఓజీని సెప్టెంబర్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు.

న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న సరిపోదా శనివారం డిఫరెంట్ కాన్సెప్ట్ తో నాని మార్క్ కంటెంట్ ఉన్న సినిమాగా వస్తుంది. ఆల్రెడీ వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికీ సినిమా చేసిన నాని ఆ సినిమాతో కొంతమంది ఆడియన్స్ ని మెప్పించాడు. అయితే ఈసారి కమర్షియల్ గా భారీ హిట్ కొట్టాలని సరిపోదా శనివారం చేస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ ను ఆగష్టు 15న ఫిక్స్ చేశారు.

ఇక ఇదే బ్యానర్ నుంచి వస్తున్న OG సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్. సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా OG. పవన్ కళ్యాణ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాగా OG సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. దాదాపు 60 శాతం వరకు పూర్తైన ఈ సినిమా త్వరలో పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దసరా, హాయ్ నాన్న హిట్లతో నాని సినిమా ఫాం లో ఉండగా సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నాడు. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాపై సూపర్ బజ్ ఉంది.

డివివి బ్యానర్ నుంచి వస్తున్న రెండు ప్రెస్టిజియస్ సినిమాల రిలీజ్ డేట్ ను ఒకేసారి ప్రకటించారు. RRR తో పాన్ ఇండియా లెవెల్ లో డివివి బ్యానర్ క్రేజ్ ఏర్పడగా రాబోతున్న ఈ సినిమాలతో మరింత హంగామా చేయనున్నారు. సో ఆగష్టులో నాని, సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ లతో దానయ్య తన సినిమాలను రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.