Begin typing your search above and press return to search.

పుష్ప 2 : దాక్షాయణి రోల్‌ సూపర్‌ లీక్‌

పుష్ప 1 లో దాక్షాయణి పాత్రలో కనిపించిన అనసూయ కు ఆశించిన స్థాయిలో ప్రాముఖ్యత దక్కలేదు.

By:  Tupaki Desk   |   8 March 2024 5:28 AM GMT
పుష్ప 2 :  దాక్షాయణి రోల్‌ సూపర్‌ లీక్‌
X

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప 2. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో ఒక్కో పాత్ర అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది అంటూ యూనిట్‌ సభ్యులు లీక్ లు ఇస్తూ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తున్నారు.

పుష్ప 1 లో దాక్షాయణి పాత్రలో కనిపించిన అనసూయ కు ఆశించిన స్థాయిలో ప్రాముఖ్యత దక్కలేదు. ఆమె లుక్ కు మంచి మార్కులు పడ్డాయి కానీ పాత్ర పరిధి మరియు స్క్రీన్‌ ప్రజెన్స్ ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగుండేది అంటూ చాలా మంది భావించారు. పుష్ప 2 లో దాక్షాయణి పాత్ర ఉంటుందా లేదా అనే అనుమానాలకు తాజాగా యూనట్‌ సభ్యులు తెర దించుతూ లీక్ ఇచ్చారు.

తమ్ముడి చావుతో పాటు, భర్త మంగళం శీను చేతిలోని పవర్‌ ను లాక్కున్నాడు అనే కోపంతో పుష్ప పై పగతో దాక్షాయణి రగిలి పోతుంది. అలాంటి సమయంలో భన్వర్ సింగ్‌ షెకావత్‌ ఆమెకు జత కలుస్తాడు. ఇద్దరు కలిసి ఎర్ర చందనం మాఫియాను తమ చేతుల్లోకి తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నాలతో కథ సాగుతుందట.

తాజా లీక్ అనుసారం పుష్ప 2 లో అనసూయ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అనిపిస్తుంది. అంతే కాకుండా ఆమె పాత్ర నిడివి కూడా ఈసారి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని దీన్ని బట్టి అర్థం అవుతుంది. రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్రను పోషించడం ద్వారా వచ్చిన గుర్తింపుతోనే అనసూయ ఇంకా కెరీర్ ను నెట్టుకు వస్తుంది.

పుష్ప 2 లో దాక్షాయణి పాత్ర కనుక పండితే కచ్చితంగా రాబోయే అయిదు ఏళ్ల పాటు ఇదే పేరుతో అనసూయను ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు అంటూ పుష్ప చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. దాక్షాయణి ని మరింత కఠినంగా, కథలో ముఖ్య పాత్రగా చూపించడం ద్వారా ప్రేక్షకులను దర్శకుడు సుకుమార్‌ సర్‌ ప్రైజ్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.