Begin typing your search above and press return to search.

ఆ బ్యూటీ హాట్ పంచ్ మామూలుగా లేదుగా!

ముంబై బ్యూటీ ద‌క్ష‌నాగ‌ర్క‌ర్ టాలీవుడ్ కి సుప‌రిచితమే. హోరా హోరి`..`జాంబిరెడ్డి` చిత్రాలతో మంచి ఐడెంటిటీని సంపాదించింది.

By:  Tupaki Desk   |   1 April 2024 12:30 AM GMT
ఆ బ్యూటీ హాట్ పంచ్ మామూలుగా లేదుగా!
X

ముంబై బ్యూటీ ద‌క్ష‌నాగ‌ర్క‌ర్ టాలీవుడ్ కి సుప‌రిచితమే. హోరా హోరి`..`జాంబిరెడ్డి` చిత్రాలతో మంచి ఐడెంటిటీని సంపాదించింది. అటుపై `బంగార్రాజు` లో ఐట‌మ్ గాళ్ల్ గా ప్ర‌మోట్ అవ్వ‌డం. రీసెంట్ గా `రావ‌ణాసుర‌`లో న‌టించ‌డం తెలిసిందే. అవ‌కాశాలు మంచివే కానీ...వైఫ‌ల్యాల‌తో ద‌క్ష బ్యూటీకి ద‌క్కాల్సిన గుర్తింపు ఇంకా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. పరాజయాల‌తో అవ‌కాశాలు కూడా రావ‌డం లేదిప్పుడు. న్యూ ఇయ‌ర్ లో ఇంత‌వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ దేనికి సైన్ చేసింది లేదు.


కానీ సోష‌ల్ మీడియా ద్వారా తాను చేయాల్సిన ప్ర‌య‌త్నాలు మాత్రం చేస్తూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో కుర్రాళ్ల‌ను హీటెక్కిస్తూ అదే క్రేజ్ ని మెయింటెన్ చేస్తుంది. స్టార్ హీరోయిన్ల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని త‌న‌లో బ్యూటీని ఆవిష్క‌రిస్తుంది. డాక్ట‌ర్ గా సేవ‌లందిచాల్సిన బ్యూటీ మినీ డ్రెస్సులో అందాలు ఆర‌బోస్తుంది. ఇది కూడా కుర్రాళ్ల‌కు ఓ ర‌క‌మైన వైద్యం లాంటిందే. ఇదంతా ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో భాగ‌మే. తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వ‌చ్చేసింది.


ఇదిగో ఇక్క‌డిలా బ్లాక్ క‌ల‌ర్ దుస్తుల్లో మ‌త్తెక్కించే చూపుల‌తో అల‌రిస్తోంది. అమ్మ‌డి మ్యాక‌ప్ ..హెయిర్ స్టైల్....త‌ల‌పై స్కాప్ ...ముస్తాబైన విధానం ప్ర‌తీది ద‌క్ష‌ని మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. బ్యూటీ అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. మ‌రి ఈ ర‌క‌మైన ఫాలోయింగ్ ద‌క్ష‌కి కొత్త అవకాశాలు తెచ్చి పెడుతుందా? అన్న‌ది చూడాలి.


అస‌లే కాంపిటీష‌న్ పీక్స్ లో ఉంది. ఓ కొత్త భామ‌ల ఎంట్రీ..మ‌రోవైపు సీనియ‌ర్ భామ‌ల దూకుడు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో క‌నిపిస్తూనే ఉంది. ఐదారు నెల‌లుగా మునుప‌టితో పోల్చితే ఇప్పుడు సీనియ‌ర్ భామ‌ల‌కే అవ‌కాశాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. యువ నాయిక‌ల్ని పరిమితంగానే తీసుకుంటున్నారు. శ్రీలీల లాంటి క్రేజీ బ్యూటీనే ఇప్పుడు ప‌క్క ప‌రిశ్ర‌మల వైపు చూస్తోంది. అంటే ద‌క్ష లాంటి అమ్మాయిల ప‌రిస్థితి ఏంటో గెస్ చేయోచ్చు.