Begin typing your search above and press return to search.

హీరోయిన్ లెగ్స్ - మసాలా వడలు.. హీరోయిన్ ఫన్నీ రిప్లై!

తాజా ఇన్ స్టాగ్రామ్ ఇంటరాక్షన్ సెషన్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో ఫన్నీ సమాధానాలు చెబుతూ ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   6 Feb 2024 5:58 AM GMT
హీరోయిన్ లెగ్స్ - మసాలా వడలు.. హీరోయిన్ ఫన్నీ రిప్లై!
X

తెలుగులో పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న హీరోయిన్ దక్షా నాగర్కర్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. బంగార్రాజు మూవీ టైంలో ఈ అమ్మడు బాగా హైలెట్ అయింది. ఆ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ మీద నాగ చైతన్య, దక్షల ఫన్నీ మూమెంట్ అందరికీ తెలిసిందే. హుషారు, రావణాసుర, జాంబీరెడ్డి వంటి చిత్రాల్లో కూడా నటించింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అమ్మడు. ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. అందాల విందుతో నెట్టింట సందడి చేస్తుంటోంది. తరచుగా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ, వారి ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతోంది. రీసెంట్ గా మరోసారి తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది.

తాజా ఇన్ స్టాగ్రామ్ ఇంటరాక్షన్ సెషన్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో ఫన్నీ సమాధానాలు చెబుతూ ఆకట్టుకుంది. కొన్నిసార్లు సీరియస్ గా, మరికొన్నిసార్లు ఫన్నీగా, ఇంకొన్నిసార్లు కాంట్రవర్శియల్ గా సమాధానాలు చెప్పింది. తాజా సెషన్ లో నెటిజన్ కామెంట్ కు ఆమె ఇచ్చిన ఆన్సర్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.

ఓ తుంటరి నెటిజన్ దక్షకు పిచ్చి ప్రశ్న వేశాడు. మీ థైస్ (తొడలు) నాకు ఇష్టం.. నేను వాటికి ఫ్యాన్.. సీక్రెట్ ఏంటో చెప్పండి మేడమ్ అన్నట్టుగా ప్రశ్న వేశాడు. దీంతో ఫన్నీగా సమాధానం చెప్పి దక్ష తప్పించుకుంది. ఎందుకు బాగున్నాయ్ అంటే.. నేను మసాలా వడలు తింటాను కాబట్టి అని చెబుతూ నవ్వేసింది. ఇలా తొడలు, వడలు ప్రాసతో దక్ష ఇచ్చిన సమాధానానికి అంతా ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఆమె చెప్పిన ఫన్నీ ఆన్సర్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షలో భలే హ్యూమరస్ యాంగిల్ ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇదే సెషన్‌లో ఆమె నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి అభిమానులు అడిగారు. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఓ తెలుగు మాట మాట్లాడండి అంటే.. క్యూట్‌ గా వదిలేయండ్రా బాబు అన్నట్టుగా చెప్పేసింది.