గామా -2025 వేడుకల్లో బ్లాక్ అవుట్ ఫిట్ లో గత్తర లేపిన దక్షా నాగర్కర్!
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ హీరోయిన్ దక్ష నగార్కర్ కూడా తన అందాలతో యువతను కట్టిపడేసింది. ఇక్కడ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన ఈమె.. పైన టాప్ డీప్ యూ నెక్ కలిగినది ఈమె ధరించింది.
By: Tupaki Desk | 1 Sept 2025 8:06 PM ISTఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా..ఇటు అవార్డ్స్ వేడుకల్లో కూడా సందడి చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే దుబాయ్ వేదికగా ఆగస్టు 30వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మక ఐదవ ఎడిషన్ చాలా అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యి.. తమ అందాలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నడూ లేనివిధంగా గ్లామర్ ప్రదర్శన చేసి.. కుర్రకారును అలరించడమే కాకుండా ఆ దుబాయ్ ఈవెంట్లో మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.. ముఖ్యంగా తమ గ్లామర్ తో ఈవెంట్ కే కొత్తదనాన్ని తీసుకొచ్చారని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ హీరోయిన్ దక్ష నగార్కర్ కూడా తన అందాలతో యువతను కట్టిపడేసింది. ఇక్కడ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన ఈమె.. పైన టాప్ డీప్ యూ నెక్ కలిగినది ఈమె ధరించింది. పైగా ఎద అందాలతో గత్తర లేపింది. ఇక నడుము భాగాన్ని హైలైట్ చేస్తూ కింద చీరను తలపించేలా ఈమె వేసుకున్న డ్రెస్సు అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా ఫ్యాషన్ ప్రియులను కూడా అలరించింది.. ప్రస్తుతం గామా వేడుకలలో దక్ష నగార్కర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పవచ్చు.
దక్ష నాగర్కర్ కెరియర్ విషయానికి వస్తే.. 2007 లో కన్నడ సినిమా 'భూగత' అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన మొదట్లోనే తన నటనతో, అందంతో అందరినీ ఆకట్టుకుంది.. ఇక 2015లో 'ఏకే రావు పీకే రావు' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించింది. 2021 లో విడుదల జాంబిరెడ్డి సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా ద్వారానే చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
'హుషారు' సినిమాలో కూడా నటించి తన నటనతో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత బంగార్రాజు, రావణాసుర, లవ్ మీ, స్వాగ్ వంటి చిత్రాలలో కూడా నటించింది దక్ష నగార్కర్.. ఇకపోతే గతంలో వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఈ మధ్య మరో కొత్త సినిమా ప్రకటించలేదు.. కానీ ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో కట్టిపడేస్తోంది. ఇకపోతే గతంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈమె కమర్షియల్ సినిమాలలో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.. మరి కనీసం ఇలా అయినా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.
