తెలుగు నటి యూరప్‌లో రచ్చ రచ్చ
దక్ష నగర్‌కర్ పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో `హుషారు` అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి ప్రయత్నం సక్సెసైంది.
By: Tupaki Desk | 20 July 2025 8:00 AM ISTదక్ష నగర్‌కర్ పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో `హుషారు` అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి ప్రయత్నం సక్సెసైంది. తనదైన అందం హుషారైన నటనతో యువతరంలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. అటుపై `జాంబీరెడ్డి` తో మరో పెద్ద సక్సెస్ ని ఖాతాలా వేసుకుంది. ఆ తర్వాత `బంగార్రాజు`లో స్పెషల్ అప్పీరియన్స్ తో ఆకట్టుకుంది. నాగచైతన్య-నాగార్జునలతో కలిసి ఓ పాటలో కనిపించింది.
దక్ష ప్రస్తుతం తెలుగు పరిశ్రమ సహా ఇరుగు పొరుగునా బిజీ నటిగా మారుతోంది. ఇక సోషల్ మీడియాలో దక్ష స్పీడ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు టెంప్టింగ్ ఫోటోలతో ఇన్ స్టాని హీటెక్కించడం ఈ భామ ప్రత్యేకత. ఇంతకుముందు జిమ్, ఫిట్నెస్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసిన దక్ష ఇటీవల గ్లామర్ ఎలివేషన్ కి సంబంధించిన ఫోటోషూట్లపైనా ఫోకస్ చేస్తోంది.
దక్ష ప్రస్తుతం యూరప్ ట్రిప్‌లో ఫుల్‌గా చిల్ చేస్తోంది. బుడాపెస్ట్ నుంచి ఇంతకుముందే ఒక వీడియోని, కొన్ని ఫోటోలను కూడా దక్ష షేర్ చేసింది. ఈ హా* బ్యూటీ పాక్షికంగా అందాలను హైలైట్ చేసే బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ తో యువతరం హృదయాలను మరిగిస్తోంది. డార్క్ థీమ్డ్ ఫోటోషూట్ తో దక్ష అందం పదింతలైంది. యూరప్ లో దక్ష బోలెడంత రచ్చ చేయబోతోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
