Begin typing your search above and press return to search.

వెంకీతో హ్యాట్రిక్.. దిల్ రాజుతో డబుల్ హ్యాట్రిక్!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ కు ఈ సంక్రాంతి కలసి రాలేదు. శైలేష్ కొలను తెరకెక్కించిన సైంధవ్ చిత్రం.. డిజాస్టర్ గా నిలిచింది

By:  Tupaki Desk   |   2 Feb 2024 9:28 AM GMT
వెంకీతో హ్యాట్రిక్.. దిల్ రాజుతో డబుల్ హ్యాట్రిక్!
X

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ కు ఈ సంక్రాంతి కలసి రాలేదు. శైలేష్ కొలను తెరకెక్కించిన సైంధవ్ చిత్రం.. డిజాస్టర్ గా నిలిచింది. తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ కాని కథను ఎంచుకుని వెంకీ మామ తప్పు చేశారంటూ కామెంట్స్ వినిపించాయి. దీంతో తిరిగి మళ్లీ వెంకటేశ్ ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వచ్చేస్తున్నారట. ఆయన కొత్త చిత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందట. అది కూడా క్రేజీ కాంబినేషన్ లోనట.

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. ఆయన చివరగా నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి చిత్రం తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. ఇక వెంకటేశ్ నెక్స్ట్ మూవీ అనిల్ రావిపూడితోనే ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ చేసింది ఎవరో కాదు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.

ఒక రకంగా అనిల్ రావిపూడి.. దిల్ రాజు ఆస్థాన దర్శకుడు అనే చెప్పాలి. దిల్ రాజు బ్యానర్ లో ఆయన ఐదు చిత్రాలు తెరకెక్కించారు. సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3, సరిలేరు నీకెవ్వరు ఇలా ఈ చిత్రాలన్నీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చినవే. ఇప్పుడు వెంకీతో తెరకెక్కించబోయే చిత్రం.. దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడికి డబుల్ హ్యాట్రిక్ మూవీ.

ఇక ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత అనిల్ రావిపూడి, వెంకీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ఇది. అంటే హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ రెండు రికార్డులు ఒకే చిత్రంతో క్రియేట్ కానున్నాయి. వెంకటేశ్ కోసం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హిలేరియస్ కథను ప్రిపేర్ చేశారట అనిల్ రావిపూడి. వెంకీ మామ కూడా పల్లెటూరి నేపథ్యంలో నటించి చాలా కాలమే అవుతోంది. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే మినిమమ్ గ్యారెంటీ హిట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అసలు ఈ మూవీ ఎలా ఉండబోతోంది? ఇందులో హీరోయిన్ ఎవరు? ఇది కూడా మల్టీ స్టారరా? అంటూ చాలానే ప్రశ్నలు అడుగుతున్నారు ఫ్యాన్స్. హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆన్ ది వే అంటూ నెట్టింట సందడి చేస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.