Begin typing your search above and press return to search.

ద‌గ్గుబాటి బోయ్స్ తో మిహీకా సూప‌ర్బ్!

ఫ్యామిలీ కి సంబంధించిన విష‌యాలు కూడా చాలా అరుదుగానే పంచుకుంటారు.

By:  Tupaki Desk   |   25 March 2024 3:34 PM GMT
ద‌గ్గుబాటి బోయ్స్ తో మిహీకా సూప‌ర్బ్!
X

రానా సతీమ‌ణి మిహీకా బ‌జాజ్ చాలా రేర్ గా నెట్టింట క‌నిపిస్తుంటారు. ఇంపార్టెంట్ అప్ డేట్స్ ఉంటే త‌ప్ప లైన్ లోకి రారు. అందులోనూ సినిమా ఫీల్డ్ తో ఆమెకి అస్స‌లు సంబంధం లేక‌పోవ‌డంతో వీలైనంత వ‌ర‌కూ వాటి జోలికి వెళ్ల‌రు. రానా అప్ డేట్స్ అందించ‌డం వంటివి ఆమె చేయ‌రు. ఫేమ‌స్ వెడ్డింగ్ ప్లానర్ ఎంతో ప్రోఫెష‌నల్ గా ఉంటారు. ఫ్యామిలీ కి సంబంధించిన విష‌యాలు కూడా చాలా అరుదుగానే పంచుకుంటారు. అందులోనూ రానా గురించి ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి.


మిగ‌తా ఏ విష‌యాల్లోనే ఆమె పెద్ద‌గా క‌నిపించ‌రు. తాజాగా మిహీకా `మా ఇద్ద‌రు బోయ్స్` అంటూ ఓ త్రో బ్యాక్ ఫోటోని షేర్ చేసారు. వివ‌రాల్లోకి వెళ్తే...అభిరాం వివాహం డిసెంబ‌ర్ లో శ్రీలంక‌లో డిస్టెనేష‌న్ వెడ్డింగ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హంగులు..ఆ ర్బాటాల‌కు దూరంగా ఉండే ఆ కుటుంబం అభిరాం వివాహం చాలా సింపుల్ గా కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో నిరాడంబ‌రంగా జ‌రిగిపోయింది. ఆ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలు కూడా కొన్నే లీక్ చేసారు. తాజాగా ఆ పెళ్లిలో భ‌ర్త‌...మ‌రిదితో క‌లిసి దిగిన ఫోటోని మిహీకా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసారు.

అందులో రానా తెల్ల పంచె..ష‌ర్ట్ ధ‌రించి సింపుల్ గా క‌నిపిస్తుండ‌గా..అభిరామ్ మాత్రం పెళ్లి కొడుకు గెట‌ప్ లో ముస్తాబై క‌నిపించాడు. క్లీన్ షేవ్..నుదిటిన బాసికం..శ‌ర్వాణీ దుస్తుల్లో చాక్లెట్ బోయ్ లా ఉన్నాడు. ఆ ప‌క్క‌నే మిహీకా కూడా ఉన్నారు. ఆమె ఎంతో అందంగా ముస్తాబ‌య్యారు. రోజ్ క‌ల‌ర్ దుస్తుల‌పై లైట్ గ్రీన్ క‌ల‌ర్ చున్నీ మ్యాచింగ్ ధ‌రించారు. ఇక మెడ‌లో బ‌రువైన‌ బంగారు హారాలు ధ‌రించారు.

చెవుల‌కు మ్యాచింగ్ బుట్ట‌లు వేసుకుని ఎంతో అందంగా క‌నిపిస్తున్నారు. అప్ప‌టి ఫోటోనే ఓ స్వీట్ మెమోరీలా ఇన్నాళ్లు దాచుకుని ఇప్పుడు షేర్ చేసారు. ఇలా ముగ్గురు క‌లిసిన ఫోటోని మిహీకా ఇంత వ‌ర‌కూ షేర్ చేయ‌లేదు. ఇదే తొలిసారి. గ‌తంలోరానాతో క‌లిసి ఉన్న ఫోటోలు షేర్ చేసిన సంద‌ర్భాలెన్నో.