Begin typing your search above and press return to search.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల విజేత‌లు వీరే!

2024 ఏడాదికి గానూ ప్ర‌తిష్టాత్మ‌క దాదాసాహెబ్ ఫాల్కే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డులను వేడుక అట్ట‌హాసంగా ముంబైలో జ‌రిగింది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 6:34 AM GMT
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల విజేత‌లు వీరే!
X

2024 ఏడాదికి గానూ ప్ర‌తిష్టాత్మ‌క దాదాసాహెబ్ ఫాల్కే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డులను వేడుక అట్ట‌హాసంగా ముంబైలో జ‌రిగింది. షారుక్ ఖాన్..రాణీముఖ‌ర్జీ..న‌య‌న‌తార‌..సందీప్ రెడ్డి వంగా త‌దిత‌రులకు అవార్డులు ద‌క్కాయి. 'జ‌వాన్' సినిమాలో న‌టించిన షారుక్ ఖాన్ కి బెస్ట్ యాక్టర్ కేటగిరిలో అవార్డు దక్కగా.. అదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన నయనతారకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ దక్కింది. 'జ‌వాన్' కి మ్యూజిక్ అందించిన అనిరుద్ ర‌విచంద్ర‌న్ కి కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరిలో అవార్డ్ అందుకున్నాడు.

ఇక తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కెరీర్ లో అత్యంత వేగంగా ఫాల్కే అవార్డు అందుకోవ‌డం విశేషం. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'యానిమ‌ల్' చిత్రంగానూ ఉత్తమ ద‌ర్శ‌కుడి హోదాలో అవార్డు అందుకున్నారు. దీంతో సందీప్ పేరు నెట్టింట మారుమ్రోగుతోంది. ఓ తెలుగు ద‌ర్శ‌కుడు త‌క్కువ‌ స‌మ‌యంలోనే అరుదైన ఘ‌న‌త సాధించాడ‌ని అభిమానులు విషెస్ తెలియ‌జ‌స్తున్నారు.

ఇక క్రిటిక్స్ విభాగం నుంచి విక్కీ కౌశ‌ల్ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యాడు. 'సామ్ బహదూర్' చిత్రంలో తన న‌ట‌న‌కు గానూ ఈ గుర్తింపు ద‌క్కింది. అయితే ఈసారి ఉత్తమ న‌టి అవార్డుల‌ను ఇద్ద‌రు హీరోయిన్లు పంచుకోవ‌డం విశేషం. వారే న‌య‌న‌తార‌... రాణీముఖ‌ర్జీ. వీరితో పాటు ఇంకా ఫాల్కే అవార్డులు అందుకున్న వారు వీరే.

బెస్ట్ యాక్టర్: షారుఖ్ ఖాన్, జవాన్

బెస్ట్ యాక్ట్రెస్: నయనతార, జవాన్

బెస్ట్ యాక్ట్రెస్: రాణి ముఖర్జీ మిసెస్ ఛాటర్జీ వర్సెస్ నార్వే

బెస్ట్ డైరెక్టర్: సందీప్ రెడ్డి వంగా, యానిమల్

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: అనిరుధ్ రవిచందర్, జవాన్

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): వరుణ్ జైన్, తేరే వాస్తే (జరా హట్కే జరా బచ్కే)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావు, బేషరం రంగ్ (పఠాన్)

బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్: బాబీ డియోల్, యానిమల్

బెస్ట్ యాక్ట్రెస్ట్ ఇన్ టీవీ సిరీస్: రూపాలీ గంగూలీ, అనుపమా

బెస్ట్ యాక్టర్ ఇన్ టీవీ సిరీస్: నీల్ భట్, ఘమ్ హై కిసీకే ప్యార్ మే

టీవీ సిరీస్ ఆఫ్ ది ఇయర్: ఘమ్ హై కిసీకే ప్యార్ మే

బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ వెబ్ సిరీస్: కరిష్మా తన్నా, స్కూప్

ఔట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ: మౌషుమీ చాటర్జీ

ఔట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ది మ్యూజిక్ ఇండస్ట్రీ: కేజే యేసుదాస్