ఫాల్కే లైఫ్ స్టోరీ.. రెండు మూవీస్ వచ్చినా పర్లేదా?
మల్టీ లాంగ్వేజ్ మూవీగా నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని, రాజమౌళి కొడుకు కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మిస్తారని అనౌన్స్మెంట్ లో వెల్లడించారు.
By: Tupaki Desk | 15 May 2025 1:12 PMభారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫాల్కేపై రెండు చిత్రాలు ఇప్పుడు రూపొందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒక మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. మరో సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ యాక్ట్ చేయనున్నారు!
నిజానికి.. కొంతకాలం క్రితం దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ను మేడ్ ఇన్ ఇండియా టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. మల్టీ లాంగ్వేజ్ మూవీగా నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని, రాజమౌళి కొడుకు కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మిస్తారని అనౌన్స్మెంట్ లో వెల్లడించారు.
ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. స్క్రిప్ట్ విని ఆశ్చర్యపోయారని టాక్ వినిపిస్తోంది. ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారని.. ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని తెలుస్తోంది. దీంతో తారక్.. మరో క్రేజీ మూవీలో నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఫ్యాన్స్ కూడా ఖుషీ అయిపోతున్నారు.
అదే సమయంలో దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ మరో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో అమీర్ ఖాన్ లీడ్ రోల్ పోషించనున్నారని సమాచారం. ఆ ప్రాజెక్ట్ పై నాలుగేళ్లుగా వర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ మొదలు కానుందని వినికిడి.
బ్రిటిష్ పాలనలో భారతీయ సినిమాలు ఎలా రూపొందించారు? చిత్రసీమకు దాదాసాహెబ్ చేసిన కృషిని రాజ్ కుమార్ హిరాణీ వివరించనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ వీఎఫ్ ఎక్స్ స్టూడియో సహాయంతోపాటు ఫాల్కే మనవడు మద్దతుతో పీరియాడికల్ డ్రామాగా హిరాణీ సినిమా తీయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీంతో ఇప్పుడు ఒకరి లైఫ్ స్టోరీపై రెండు సినిమాలు రూపొందడమంటే మామూలు విషయం కాదు. అటు రాజ్ కుమార్ హిరాణీ.. ఇటు రాజమౌళి (సమర్పణతోపాటు స్క్రిప్ట్ వర్క్ లో కూడా సహాయం చేస్తున్నారు) ఇద్దరూ తోప్ డైరక్టరే. కాబట్టి రెండు ప్రాజెక్టుల కోసం అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తారు. కానీ మార్కెట్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది.. దీంతో రెండు సినిమాల మేకర్స్ ఏం చేస్తారో.. ఎలా తీస్తారో.. ఎలా మెప్పిస్తారో.. ఎంతటి హిట్స్ కొడతారో వేచి చూడాలి.