Begin typing your search above and press return to search.

'డకాయిట్'.. దోపిడీ దొంగల ప్రేమకథ..

ఒక దాడి జరిగిన ప్రాంతంలో విడిపోయిన ప్రేమికులు ఇద్దరు కలిసి ఒకరిని ఒకరు తుపాకులతో గురి పెట్టుకోవడం టీజర్ కి హైలైట్ గా నిలిచింది

By:  Tupaki Desk   |   20 Dec 2023 12:06 PM GMT
డకాయిట్.. దోపిడీ దొంగల ప్రేమకథ..
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో అడివి శేష్ ఒకరు. అందరిలా రొటీన్, కమర్షియల్ సినిమాలు కాకుండా ఈ హీరో డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. క్షణం, ఎవరు, గూడచారి, మేజర్, హిట్ 2.. ఇలా వరుస విజయాలు అందుకుని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అడవి శేష్ సినిమాలకు ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే.


ఇతను ఓ సినిమాకి కమిట్ అయ్యాడంటే డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? తదితర అంశాలను ఏమాత్రం పట్టించుకోకుండా అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడంటే ఆడియన్స్ లో ఎప్పుడూ ఆ ప్రాజెక్టు పై ఆసక్తి ఉంటుంది. కాగా ఇటీవలే ఈ హీరో శృతిహాసన్ తో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. #SeshEXShruti అనే వర్కింగ్ టైటిల్ తో రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్టుని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శానిల్ డియో ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. నేడు ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 'డకాయిట్' అనే టైటిల్ని ఖరారు చేశారు. 'డకాయిట్' అంటే తెలుగులో దోపిడి దొంగ అని అర్థం. టీజర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో అడివి శేష్, శృతిహాసన్ ఇద్దరు దొంగలుగా కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఒక దాడి జరిగిన ప్రాంతంలో విడిపోయిన ప్రేమికులు ఇద్దరు కలిసి ఒకరిని ఒకరు తుపాకులతో గురి పెట్టుకోవడం టీజర్ కి హైలైట్ గా నిలిచింది. 'జూలియేట్ ఎన్నేళ్ళయింది మనం కలసి' అనే డైలాగ్ చెబుతూ అడవి శేష్ మాస్క్ వేసుకొని కనిపించగా..' కలిసి కాదు విడిపోయి' అంటూ శృతిహాసన్ చేతిలో గన్ పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. 'నీ మోసం మర్చిపోలేదు' అని శృతిహాసన్ చెప్పడాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి మధ్య గతంలో ఏదో జరిగే ఉంటుందని ఊహించవచ్చు.

'ఇప్పుడు నేను వెధవనా, దొంగనా, విలన్ నా?.. అని అడివి శేష్ శృతిహాసన్ తో చెప్పే డైలాగ్ తో వీళ్ళిద్దరూ ప్రేమికులా? దొంగలా? శత్రువులా? అనే క్యూరియాసిటీని ఆడియన్స్ లో క్రియేట్ చేశారు. టీజర్ లో బీజీయం మాత్రం మెయిన్ హైలెట్ అనే చెప్పాలి. హిందీ, తెలుగు రెండు భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతుందని త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుందని టీజర్ లో స్పష్టం చేశారు మేకర్స్.