డెకాయిట్ ఆగిపోయిందనుకున్న వాళ్లకి ఆన్సర్ దొరికింది..!
అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా షానీల్ డియో డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా డెకాయిట్.
By: Tupaki Desk | 19 May 2025 5:19 PMఅడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా షానీల్ డియో డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా డెకాయిట్. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదలైన నాటి నుంచి ఏం జరుగుతుంది అన్నది ఇప్పటివరకు ఎవరికీ తెలియట్లేదు. ముందు శృతి హాసన్ తో ఒక టీజర్ రిలీజ్ చేశారు డెకాయిట్ టీం. ఆ తర్వాత ఏడాది తర్వాత హీరోయిన్ ని మార్చి మరో టీజర్ వదిలారు.
అడివి శేష్ సినిమాలు అన్నీ కూడా కంటెంట్ బేస్డ్ మూవీస్ గా వస్తాయి. ఐతే అవి ఎప్పుడు వస్తాయన్నది చెప్పడం కష్టం. అడివి శెష్ డెకాయిట్ తో పాటుగా జి 2 కూడా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. గూఢచారి సక్సెస్ తర్వాత చాలా గ్యాప్ తో గూఢచారి 2 చేస్తున్నాడు అడివి శేష్. ఐతే డెకాయిట్ సినిమా ఆగిపోయింది అనే వార్తలు వినిపించాయి. ఈ విషయంపై అన్నపూర్ణ కాంపౌండ్ హీరో సుమంత్ స్పందించారు.
సుప్రియ నిర్మాణంలో వస్తున్న డెకాయిట్ సినిమా ఆగిపోలేదని ఆ సినిమా వర్క్ జరుగుతుందని అన్నారు. తమ బ్యానర్ లో వచ్చే సినిమాల గురించి అందరికీ అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ ఎవరం కూడా కావాలని డీటైల్స్ తెలుసుకోవాలని ప్రయత్నించమని అన్నారు సుమంత్. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటామని చెప్పిన సుమంత్ అందరం నెలకోసారి చిల్ అవుతుంటామని.. ఇక బోర్డు మీటింగ్ జరిగితే మాత్రం అందరం కంపల్సరీ పాల్గొంటామని చెప్పారు.
అక్కినేని హీరోల్లో సుమంత్ కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఐతే అనగనగా సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కెరీర్ మొదట్లో నాగార్జునతో కలిసి సినిమాలు చేసిన సుమంత్ సోలో హీరోగా లక్ కలిసి రాలేదు. అయినా కూడా తన మార్క్ సినిమాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సీతారామం సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించి సినిమా సక్సెస్ లో భాగం అయ్యారు సుమంత్. సుమంత్ తో కలిసి మిగతా యువ హీరోలు కూడా కలిసి సినిమాలు చేయాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.