Begin typing your search above and press return to search.

అడివి శేష్ 'డెకాయిట్': సెన్సార్ పూర్తి.. ట్రైలర్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఎంచుకునే కథలు ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటాయి.

By:  M Prashanth   |   2 April 2026 6:42 PM IST
అడివి శేష్ డెకాయిట్: సెన్సార్ పూర్తి.. ట్రైలర్ ఎప్పుడంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఎంచుకునే కథలు ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటాయి. ‘క్షణం’ నుంచి ‘హిట్ 2’ వరకు ఆయన కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు అదే బాటలో ‘డెకాయిట్’ అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.






ఈ సినిమాలో అడివి శేష్ మునుపెన్నడూ లేని విధంగా చాలా రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నారు. పోస్టర్స్ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ‘ఒక ప్రేమ కథ’ అనే ట్యాగ్ లైన్ ఉన్నప్పటికీ, సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయని మేకర్స్ హింట్ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి విడుదల కాబోతోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఇక ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘డెకాయిట్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమాలో ఉన్న ఇంటెన్స్ యాక్షన్, రొమాన్స్ కారణంగా ఈ సర్టిఫికేట్ లభించినట్లు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారనే వార్త ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. కథలో ఉన్న ట్విస్టులు, శేష్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అవుతాయని అంటున్నారు. అలాగే సినిమా ట్రైలర్ ను ఈ నెల 4న రిలీజ్ చేయనున్నారు.

సాధారణంగా శేష్ సినిమాలకు క్లాస్ ఆడియన్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ‘డెకాయిట్’ తో మాస్ యూత్ ను కూడా గట్టిగా ఎట్రాక్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకే ప్రమోషన్లలో హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్ ను ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలవడంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

​సినిమా కథాంశం ప్రేమ, నమ్మకద్రోహం, ప్రతీకారం అనే మూడు ప్రధాన అంశాల చుట్టూ తిరగనుంది. అడివి శేష్ గత చిత్రాల కంటే ఇది చాలా డిఫరెంట్ గా, రఫ్ గా ఉండటంతో అభిమానులు ఆయన మేకోవర్ కు ఫిదా అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనురాగ్ కశ్యప్ లాంటి వెర్సటైల్ నటుడు విలన్ గా ఉండటం సినిమాకు మరింత బలాన్ని ఇస్తోంది. ప్రకాష్ రాజ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

​మేకర్స్ డిఫరెంట్ పోస్టర్లతో సినిమాపై ఉన్న క్యూరియాసిటీని పెంచుతున్నారు. అడివి శేష్ తన మార్క్ ట్విస్టులతో ఈసారి ఎలాంటి థ్రిల్ ఇస్తారో చూడాలి. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల కాబోతోంది కాబట్టి, పాన్ ఇండియా స్థాయిలో రాబోయే ట్రైలర్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.