వీడియో : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దబిడి దిబిడి
యాంకర్ కనికా కపూర్ విజ్ఞప్తి మేరకు ఊర్వశి డాకు మహారాజ్ ఐటెం సాంగ్ దబిబి దిబిడి పాట అందుకుంది.
By: Tupaki Desk | 22 May 2025 11:00 PM ISTఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమాలోని దబిడి దిబిడి పాట ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆ పాటకు మంచి పాపులారిటీ దక్కింది. బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌతేలా ఆ పాటకు డాన్స్ వేసి మెప్పించింది. దబిడి దిబిడి అంటూ ఊర్వశి రౌతేలా ఎక్కడికి వెళ్లినా సందడి చేస్తూనే ఉంది. ఆ పాట కారణంగా ఊర్వశి కి సైతం మంచి పాపులారిటీ దక్కింది. హీరోయిన్‌గా నటించడం కంటే కూడా దబిడి దిబిడి పాటలో కనిపించడం వల్ల, బాలకృష్ణతో ఆ డాన్స్ మూమెంట్స్ చేయడం వల్ల ఎక్కువగా ఊర్వశికి గుర్తింపు లభించింది.
అంతకు ముందు ఎన్నో ఐటెం సాంగ్స్ చేసిన ఊర్వశి రౌతేలాకు రాని గుర్తింపు, స్టార్‌డం కేవలం దబిడి దిబిడి వల్ల వచ్చింది అనడంలో సందేహం లేదు. అలాంటి దబిడి దిబిడి సాంగ్ ను ఊర్వశి రౌతేలా ఏకంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరు అయిన సమయంలో పాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ పై ఊర్వశి రౌతేలా తన అందంతో అదరగొట్టిన విషయం తెల్సిందే. రెండు రోజుల పాటు విభిన్నమైన అందాల ఔట్ ఫిట్స్‌తో దబిడి దిబిడి అనిపించేంత అందంగా ఊర్వశి రెడ్ కార్పెట్‌పై వాక్ చేయడంతో అంతర్జాతీయ స్థాయి కెమెరా మెన్‌లు, మీడియా వారు ఆమెను అలాగూ చూస్తూ ఉండి పోయారని టాక్.
రెడ్ కార్పెట్ వాక్ తర్వాత ఊర్వశి రౌతేలాను కనికా కపూర్ ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో చాలా మంది ఊర్వశి అభిమానులు, మద్దతుదారులు అక్కడ ఉన్నారు. అప్పుడు ఊర్వశిని దబిడి దిబిడి పాట పాడలంటూ అంతా కోరారు. యాంకర్ కనికా కపూర్ విజ్ఞప్తి మేరకు ఊర్వశి డాకు మహారాజ్ ఐటెం సాంగ్ దబిబి దిబిడి పాట అందుకుంది. పాటకు తగ్గట్లుగానే అక్కడున్న వారు గట్టిగా అరుస్తూ ఆమెను ఎంకరేజ్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఊర్వశి ఈ పాటకు డాన్స్ చేయడంతో పాటు, పలు వేదికలపై పాడింది కూడా... అయినా ఈ సారి వచ్చిన పబ్లిసిటీ మరెప్పుడు రాలేదు. ఊర్వశి రౌతేలా కేవలం ఒకే ఒక్క పాటతో కెరీర్‌లో హై పొజీషన్‌కి చేరింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా జోరు ముందు నిలవలేక పోయింది కానీ, కచ్చితంగా కమర్షియల్‌గా బిగ్ హిట్ దక్కించుకోవాల్సిన స్టామినా, సత్తా ఉన్న మూవీ అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాలో ఊర్వశి రౌతేలా కేవలం ఐటెం సాంగ్‌కి పరిమితం కాకుండా ముఖ్య పాత్రలో కనిపించింది. అందాల ఆరబోత చేయడం మాత్రమే కాకుండా ఒక యాక్షన్ సీన్‌ను చేయడం ద్వారా సినిమాలో మిగిలిన ఇద్దరితో పోల్చితే ఎక్కువ స్క్రీన్ స్పేస్, ప్రాముఖ్యత దక్కించుకుంది. అందుకే ఊర్వశి కి డాకు మహారాజ్, దబిడి దిబిడి చాలా స్పెషల్.
