Begin typing your search above and press return to search.

'దిశ' కేసుపై సినిమా.. కరీనా ఏం చెబుతుందో?

2019లో హైదరాబాద్ హత్యాచార (దిశ) కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 April 2025 3:00 AM IST
దిశ కేసుపై సినిమా.. కరీనా ఏం చెబుతుందో?
X

2019లో హైదరాబాద్ హత్యాచార (దిశ) కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్‌ శంషాబాద్‌ లో హత్యాచారానికి గురవ్వగా.. నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేశారు. అయితే దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఆ ఘటన ఆధారంగా ఇప్పుడు మూవీ తెరకెక్కనుంది.

వాస్తవిక ఘటనల ఆధారంగా సినిమా అంటే అందరికీ గుర్తొచ్చే అతి తక్కువ మంది డైరెక్టర్స్ లో మేఘనా గుల్జార్ ఒకరు. ఇప్పుడు ఆమెనే.. హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసును కథగా మార్చి సిల్వర్ స్క్రీన్ పై చూపించనున్నారు. (దాయ్రా) Daayra అనే టైటిల్‌ ను ఖరారు చేయగా.. మాలీవుడ్ స్టార్ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బాలీవుడ్ భామ కరీనా కపూర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మేఘనా గుల్జార్‌ తోపాటు యశ్‌, సిమా సహ రచయితలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు క్యాస్టింగ్ వివరాలు అనౌన్స్ చేయడంతో వాటికి చెక్ పడింది.

దాయ్రా లో పృథ్వీరాజ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. అయితే స్క్రిప్ట్ వినగానే ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని ఆయన తెలిపారు. తనది ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే రోల్ అని అన్నారు. మరోవైపు, కరీనా రోల్ కూడా సినిమాలో కీలకమే. మేఘనా గుల్జార్ కు తాను పెద్ద ఫ్యాన్ అని తెలిపారు. ఆమె డైరెక్షన్ లో యాక్ట్ చేయాలనేది తన డ్రీమ్ గా చెప్పారు.

ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందోనని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు కరీనా. అయితే ఆమె.. ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు తన కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ ను టచ్ చేసిన వేళ.. మేఘనా గుల్జార్ తో దాయ్రా సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

అయితే ఇప్పటి వరకు కెరీర్ లో ఎన్నో మంచి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు దాయ్రా మూవీలో నటిస్తున్నారు. అదే సమయంలో మేఘనా గుల్జార్ వర్క్ గురించి అందరికీ తెలిసిందే. సెన్సిటివ్ అంశాలను హ్యాండిల్ చేయడంలో దిట్ట. ఇప్పుడు ఇండియా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసిన దిశ కేసును సినిమాగా తీస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ మూవీతో కరీనా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.