Begin typing your search above and press return to search.

జపాన్ లో దేవర క్రేజ్ ఇది..!

ఎన్టీఆర్ దేవర సినిమాలో దావుది సాంగ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ఆ సాంగ్ ను కవర్ చేశారు. అది కూడా మన వాళ్లు కాదు జపనీస్ ఈ సాంగ్ ను కవర్ చేస్తూ వీడియో చేశారు.

By:  Tupaki Desk   |   15 Oct 2024 5:58 PM IST
జపాన్ లో దేవర క్రేజ్ ఇది..!
X

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర సినిమా పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజై సూపర్ సక్సెస్ అయ్యింది. సినిమా ఫస్ట్ టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల బీభత్సం సృష్టించి తారక్ స్టామినా ఏంటన్నది ఈ సినిమాతో ప్రూవ్ చేసింది. ఎన్టీఆర్ లో దేవర, వర రెండు పాత్రల్లో కూడా తారక్ తన నటనతో ఆకట్టుకున్నాడు. జాన్వి కపూర్ కూడా తొలి తెలుగు సినిమాలో తన మార్క్ నటనతో మెప్పించింది.

ఎన్టీఆర్ దేవర సినిమాలో దావుది సాంగ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ఆ సాంగ్ ను కవర్ చేశారు. అది కూడా మన వాళ్లు కాదు జపనీస్ ఈ సాంగ్ ను కవర్ చేస్తూ వీడియో చేశారు. RRR తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించిన ఎన్టీఆర్ దేవర తో వరల్డ్ సినీ లవర్స్ ని అలరించాడు.

ముఖ్యంగా తారక్ డ్యాన్స్ అంటే అందరికీ ఇష్టం. ఆయన్ను ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. ఇదివరకు ఎన్టీఆర్ సాంగ్స్ చాలా కవర్ చేసిన ఈ జంట ఇప్పుడు లేటెస్ట్ గా దేవర సినిమాలో దావుది సాంగ్ ని చేశారు. తారక్ లోని గ్రేస్ ని మ్యాచ్ చేయడం కష్టం కానీ దాదాపు మ్యాచ్ చేసినంత పని చేశారు. దేవర సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.

దేవర సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ హైలెట్ గా నిలిచింది. దేవర సాంగ్ కు జపనీస్ జంట డ్యాన్స్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. తన ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన ఎన్టీఆర్.. ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. అందుకే తారక్ ప్రతి సినిమా మీద వరల్డ్ సినీ లవర్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ మొదలైంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మన తారక రాముడి దేవరలోని దావుది సాంగ్ ను ఆ జపనీస్ జంట ఎలా చేసిందో ఓ లుక్కేయండి..