Begin typing your search above and press return to search.

రీమేక్ రైట్స్ తోనే 50 కోట్లు?

తమిళ్ లో కమల్ హాసన్, కన్నడంలో వి రవిచంద్రన్ లీడ్ రోల్ చేశారు.

By:  Tupaki Desk   |   2 March 2024 4:22 AM GMT
రీమేక్ రైట్స్ తోనే 50 కోట్లు?
X

మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మీనా కాంబినేషన్ లో తెరకెక్కి సూపర్ హిట్ అయిన మూవీ దృశ్యం. ఈ సినిమాని తరువాత తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి హిట్ కొట్టాడు. తమిళ్ లో కమల్ హాసన్, కన్నడంలో వి రవిచంద్రన్ లీడ్ రోల్ చేశారు. హిందీలో అజయ్ దేవగన్ నటించారు. రీమేక్ అయిన అన్ని భాషలలో ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

ఇండియన్ భాషలు కాకుండా కొరియన్, ఇండోనేషియా, చైనీస్ భాషల్లో కూడా ఈ మూవీ రీమేక్ అయ్యింది. జీతూ జోసెఫ్ దృశ్యం సీక్వెల్ కూడా చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు దృశ్యం మూవీ హాలీవుడ్ లో కూడా అఫీషియల్ గా రీమేక్ అవుతోంది. మరో వైపు దృశ్యం ఫ్రాంచైజ్ లో సిరీస్ లు చేయాలని జీతూ జోసెఫ్ ప్లాన్ చేసుకుంటున్నారు..

ఈ సినిమాని దర్శక నిర్మాతలు ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కాని కేవలం రీమేక్ రైట్స్ ద్వారానే ఇప్పటి వరకు 40 నుంచి 50 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై అంటోనీ పెరంబదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ మేగ్జిమమ్ సినిమాలు మోహన్ లాల్ హీరోగానే చేయడం విశేషం.

అయితే దృశ్యం మూవీ మాత్రం ఈ ప్రొడక్షన్ హౌస్ కి భారీగా లాభాలు తెచ్చి పెడుతూనే ఉంది. జీతూ జోసెఫ్ కూడా మోహన్ లాల్ తో దృశ్యం తర్వాత ఐదు సినిమాల వరకు చేశాడు. గత ఏడాది నీరు అనే మూవీతో మరో హిట్ ని ఇచ్చాడు. ఇందులో కూడా ఓ ఇంటరెస్టింగ్ సోషల్ మెసేజ్ ని జీతూ జోసెఫ్ చెప్పడం విశేషం.

హాలీవుడ్ లో రీమేక్ అయ్యి హిట్ అయితే మాత్రం దృశ్యం సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ దొరుకుతుంది. జీతూ జోసెఫ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో నెక్స్ట్ రాబోయే మూవీ దృశ్యం 3 అనే మాట వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.