Begin typing your search above and press return to search.

ప్లాప్ అవుతున్నా.. ఈ పాప స్టెప్పులకు కోట్లే!

2 నుంచి 4 నిమిషాల నిడివి ఉన్న ఈ సాంగ్స్ కోసం ఊర్వశీ గట్టిగానే వసూలు చేసింది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 5:03 AM GMT
ప్లాప్ అవుతున్నా.. ఈ పాప స్టెప్పులకు కోట్లే!
X

ఒకప్పటి మిస్ యూనివర్స్, బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా చేసిన సినిమాలు తక్కువే అయిన పాపులారిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా కమర్షియల్ యాడ్స్, ఫోటోషూట్ లతో ఊర్వశీ దేశ వ్యాప్తంగా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అందుకే ఆమె కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే చేస్తోన్న హీరోయిన్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా ఊర్వశీ హాట్ ఫేవరేట్ గా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యలో బాస్ పార్టీ సాంగ్ లో ఈ బ్యూటీ డాన్స్ చేసింది. ఆ సాంగ్ కోసం కోటికి పైగానే రెమ్యునరేషన్ ని ఊర్వశీ అందుకుందంట. తరువాత ఏజెంట్, పవన్ కళ్యాణ్ బ్రో, రామ్ పోతినేని స్కంద సినిమాలలో ఈ భామ ఐటెం సాంగ్స్ చేసింది. 2 నుంచి 4 నిమిషాల నిడివి ఉన్న ఈ సాంగ్స్ కోసం ఊర్వశీ గట్టిగానే వసూలు చేసింది.

కోటి నుంచి రెండు కోట్ల మధ్యనే సినిమాకి ఆమె డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. అయిన కూడా టాలీవుడ్ దర్శక, నిర్మాతలు కచ్చితంగా తమ చిత్రాలలో ఐటెం సాంగ్స్ కి ఊర్వశీ అయితేనే బెటర్ అని అనుకుంటున్నారు. రెమ్యునరేషన్ ఎంతైనా చెల్లించి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగా ఈ బ్యూటీకి పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి.

హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో ఐటెం సాంగ్స్ కి సిద్ధమైపోయారు. ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ గా ఇస్తూ ఉండటంతో పాటలలో తలుక్కున మెరిసేందుకు సిద్ధంగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే కూడా రంగస్థలంలో ఐటెం సాంగ్ చేసింది. సమంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో నర్తించింది.

అయితే ఇప్పుడు హీరోయిన్స్ కంటే ఊర్వశీకి దర్శకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి టాలీవుడ్ లో ఊర్వశీ రౌతేలా జోరు ఇంకెంత కాలం కొనసాగుతుందనేది చూడాలి. హిందీలో అయితే చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ ఆమె చేతిలో లేవు. అక్కడ కూడా ఐటెం సాంగ్స్ కోసమే ఊర్వశీని సంప్రదిస్తున్నారు.