Begin typing your search above and press return to search.

క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని యంగ్ హీరో మోసం చేశాడా?

స్వ‌యంకృషితో పైకొచ్చి హీరోగా, నిర్మాత‌గా మంచి పేరు తెచ్చుకున్న శివ కార్తికేయ‌న్ ప్ర‌స్తుతం 'అయాల‌న్‌' మూవీతో పాటు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఓ సినిమా, మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమా చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 10:06 AM GMT
క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని యంగ్ హీరో మోసం చేశాడా?
X

కోలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన వ్య‌క్తి శివ కార్తికేయ‌న్‌. క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రామ్స్‌, స్టాండ‌ప్ కామెడీతో ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న శివ కార్తికేయ‌న్ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో అజిత్ న‌టించిన 'ఏగ‌న్‌' కోసం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఆడిష‌న్స్‌కు వెళ్లారు. సెలెక్ట్ అయినా ఫైన‌ల్ క‌ట్‌లో అత‌ని సీన్‌లని తొల‌గించ‌డంతో తీవ్ర నిరాశ‌కు గుర‌య్యాడు. ఆ త‌రువాత ద‌ర్శ‌కుడు అట్లీ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ 'ముగ‌ప్పుతాగ‌మ్‌'లో న‌టించాడు. పాండిరాజ్ 'మ‌రీనా'తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచ‌లంచెలుగా ఎదిగి ఇప్ప‌డు స్టార్ హీరోల్లో ఒక‌డిగా నిలిచాడు శివ కార్తికేయ‌న్‌.

స్వ‌యంకృషితో పైకొచ్చి హీరోగా, నిర్మాత‌గా మంచి పేరు తెచ్చుకున్న శివ కార్తికేయ‌న్ ప్ర‌స్తుతం 'అయాల‌న్‌' మూవీతో పాటు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఓ సినిమా, మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఇందులో 'అయాల‌న్‌' రిలీజ్‌కు రెడీ అవుతుండ‌గా, క‌మ‌ల్ నిర్మిస్తున్న సినిమా, మురుగ‌దాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమాల‌లో న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే క్రేజీ హిట్‌ల‌తో హీరోగా త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్న శివ కార్తికేయ‌న్‌పై జాతీయ అవార్డు గ్ర‌హీత అయిన డి.ఇమాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న‌కు శివ కార్తికేయ‌న్ న‌మ్మ‌క ద్రోహం చేశాడ‌ని, త‌ను ఓ సినిమా విష‌యంలో మాట త‌ప్పి న‌మ్మ‌క ద్రోహం చేశాడ‌ని సంగీత ద‌ర్శ‌కుడు డి. ఇమాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు చేసిన ద్రోహం గురించి శివ కార్తికేయ‌న్‌ని నిల‌దీస్తే చిత్ర‌మై స‌మాధానం చెప్పాడ‌ని మండిప‌డ్డారు. ఈ జ‌న్మ‌లో అత‌నితో సినిమాలు చేయ‌న‌ని చెప్ప‌డం త‌మిళ‌నాట సంచ‌ల‌నంగా మారింది. గ‌తంలో శివ కార్తికేయ‌న్‌కు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ 'వ‌రుత్త‌ ప‌డాతు వాలిబార్ సంఘం'.

దీన్నే తెలుగులో మంచు మ‌నోజ్ హీరోగా 'క‌రెంట్ తీగ‌'గా రీమేక్ చేశారు. 'వ‌రాత్త‌ ప‌డాతు వాలిబార్ సంఘం' సూప‌ర్ హిట్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం డి. ఇమాన్ అందించిన సంగీతం. ఇప్ప‌టికీ శివ కార్తికేయ‌న్ న‌టించిన సినిమాల్లో 'వ‌రుత్త‌ ప‌డాతు వాలిబార్ సంఘం' మ్యూజిక్ ఎవ‌ర్ గ్రీన్ గా నిలిచింది. ఇలాంటి మ్యూజిక‌ల్ హిట్‌ని శివ కార్తికేయ‌న్‌కు అందించిన డి.ఇమాన్ ఆ త‌రువాత నుంచి త‌న‌తో క‌లిసి సినిమాలు చేయ‌డం మానేశాడు. ఇన్నేళ్ల త‌రువాత శివ కార్తికేయ‌న్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో కోలీవుడ్‌లో ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.