Begin typing your search above and press return to search.

మే నెలలో క్రేజీ సినిమాలు.. ఆశలన్నీ వాటిపైనే..

అయితే మే నెలలో కాస్త బజ్ ఉన్న మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మే 3న ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్ లోకి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 May 2024 4:06 AM GMT
మే నెలలో క్రేజీ సినిమాలు.. ఆశలన్నీ వాటిపైనే..
X

ఏప్రిల్ నెలలో టాలీవుడ్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ లభించలేదు. ఏప్రిల్ నెల ఆరంభంలో దిల్ రాజు నుంచి ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. తర్వాత ఏ చిత్రాలు కూడా థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. కొన్ని సినిమాలైతే కనీసం వీకెండ్ మూడు రోజులు కూడా ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించలేక పోయాయి.

ఓవరాల్ గా చూసుకుంటే ఏప్రిల్ నెలలో 16 నుంచి 20 సినిమాల వరకు రిలీజ్ అయితే అన్ని కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ గానే మారాయి. అయితే మే నెలలో కాస్త బజ్ ఉన్న మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మే 3న ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్ లోకి వస్తున్నాయి. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అవుతోంది.

ఈ సినిమా ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. యంగ్ హీరో సుహాస్ నుంచి ప్రసన్న వదనం అనే మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాపై కొంత బజ్ క్రియేట్ అయ్యి ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ చేసిన శబరి మే3న రిలీజ్ అవుతోంది. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ్ మూవీ బాక్ ప్రేక్షకుల ముందుకి వస్తోంది.

అరణ్మనై సిరీస్ లో నాలుగో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్స్ రాశిఖన్నా, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. దీంతో మూవీ పై కొంత ఆసక్తి నెలకొని ఉంది. మే 10న సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ కృష్ణమ్మ రిలీజ్ అవుతోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మే 17న రిలీజ్ కాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడం విశేషం. విశ్వక్ సేన్ మూవీ అంటే కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందని అభిప్రాయం ఆడియన్స్ లో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కచ్చితంగా సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మే25న దిల్ రాజు బ్యానర్ నుంచి ఆశిష్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్ లో తెరకెక్కిన లవ్ మీ మూవీ ప్రేక్షకులను పలకరించబోతోంది. లవ్ అండ్ హర్రర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతోంది. దిల్ రాజు ప్రొడక్షన్ మూవీ కాబట్టి స్ట్రాంగ్ ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. దీంతో సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఈ నెల ఆఖరులో సుధీర్ బాబు యాక్షన్ థ్రిల్లర్ హరోమ్ హర, ఆనంద్ దేవరకొండ గంగం గణేశా మూవీలు రాబోతున్నాయి. ఈ రెండింటిలో సుధీర్ బాబు సినిమా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.