క్రేజీ సీక్వెల్స్ వారికి బ్రహ్మాస్త్రాలేనా?
ఇప్పుడు అవే బ్రహ్మాస్ట్రాల కోసం అటు హీరోలు, ఇటు దర్శకులతో పాటు సగటు సినీ లవర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
By: Tupaki Desk | 6 May 2025 5:30 PMకెరీర్‌లో టాప్ హిట్ లని, బ్లాక్ బస్టర్లని, పాన్ ఇండియా హిట్‌లని సొంతం చేసుకున్న హీరోలు, డైరెక్టర్లు మన టాలీవుడ్‌లో ఉన్నారు. అయితే వాళ్లకి సీక్వెల్స్ ఇప్పుడు బ్రహ్మాస్త్రాలగా మారుతున్నాయి. కెరీర్‌లో డౌన్ అయ్యామని భావించిన వారికి సీక్వెల్స్ వారికి కెరీర్‌ని కాపాడి మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చే భారీ బ్రహ్మాస్త్రాలవుతున్నాయి. ఇప్పుడు అవే బ్రహ్మాస్ట్రాల కోసం అటు హీరోలు, ఇటు దర్శకులతో పాటు సగటు సినీ లవర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
అవే కార్తికేయ 3, పుష్ప 3, కేజీఎఫ్ 3, హిట్ 4. చందూ మొండేటి, నిఖిల్‌ల కెరీర్‌కు కార్తీకేయ సిరీస్ సినిమాలు ఎంత వరకు ఉపయోగపడ్డాయో తెలిసిందే. దర్శకుడిగా చందూ మొండేటికి, హీరోగా నిఖిల్‌కు ఈ సినిమాలు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. `తండేల్` తరువాత చందూ మొండేటి మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. నిఖిల్ రెండు ప్రాజెక్ట్‌లు `స్వయంభు`, ది ఇండియా గేట్ సినిమాలు చేస్తున్నాడు. వీరిద్దరి కెరీర్ ఫ్యూచర్ లో ఎప్పుడన్నా డౌన్ అయిందనే పరిస్థితి తలెత్తితే బ్రహ్మాస్త్రంగా `కార్తికేయ 3`ని తెరపైకి తీసుకొస్తారు. మళ్లీ ట్రాక్‌లోకొస్తారు.
ఇక అల్లు అర్జున్ కూడా అంతే. ప్రస్తుతం బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. దీని తరువాత మరో ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల అవి వర్కవుట్ కాకపోతే ఫ్యూచర్ లో బన్నీ బయటకి తీసే బ్రహ్మాస్త్రం `పుష్ప 3`. ఇదే తరహాలో డైరెక్టర్ సుకుమార్ కూడా ఇతర ప్రాజెక్ట్‌లు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అవి ఒకవేల పొరపాటున ఎమన్నా మిస్ ఫైర్ అయితే అప్పుడు సుకుమార్ బయటికి తీసే బ్రహ్మాస్త్రం `పుష్ప 3`.
ఇక శైలేష్ కొలను `హిట్ 4` పరిస్థితి కూడా అంతే. హిట్ 3 ఎండింగ్‌లో `హిట్ 4`కు హింట్ ఇవ్వడం, ఇందులో కార్తి హీరోగా నటిస్తాడని క్లారిటీ ఇవ్వడం తెలిసిందే. ఇది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈ మధ్యలో శైలేష్ కొలను మరేదైనా ప్రాజెక్ట్ చేస్తే అది ఆశించిన స్థాయిలో అంటే `సైంధవ్` స్థాయిలో ఆకట్టుకోలేకపోతే అప్పుడు తను తెరపైకి తీసుకొచ్చే బ్రహ్మాస్త్రం `హిట్ 4`.
ఈ క్రేజీ సీక్వెల్స్ తరువాత టాక్ ఆఫ్ ది ఇండియాగా నిలుస్తున్న ప్రాజెక్ట్ `కేజీఎఫ్ 3`. ప్రస్తుతం యష్ `టాక్సిక్`, రామాయణ` సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా రెండు ప్రాజెక్ట్‌లతో రాబోతున్నాడు. ఎన్టీఆర్‌తో `డ్రాగన్`, ప్రభాస్‌తో `సలార్ 2`. ఈ ఇద్దరి ప్రాజెక్ట్‌లు అటు ఇటు అయితే యష్, ప్రశాంత్ నీల్‌లకున్న బ్రహ్మాస్త్రం `కేజీఎఫ్ 3`. ఇలా ప్రతి స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ తమ బ్రహ్మాస్త్రాలని తమ అమ్ముల పొదిలో పెట్టుకుని సమయం వచ్చినప్పుడు వాటిని బయటికి తీయడానికి రెడీగా ఉన్నారు.