Begin typing your search above and press return to search.

క్రాక్.. నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే సాహ‌సాలు

విద్యుత్ జ‌మ్వాల్ తెలుగు వారికి కొత్తేమీ కాదు. అత‌డు ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన తుపాకిలో విల‌న్ గా న‌టించాడు

By:  Tupaki Desk   |   9 Feb 2024 4:51 PM GMT
క్రాక్.. నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే సాహ‌సాలు
X

విద్యుత్ జ‌మ్వాల్ తెలుగు వారికి కొత్తేమీ కాదు. అత‌డు ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన తుపాకిలో విల‌న్ గా న‌టించాడు. ఆ త‌ర్వాత ప‌లు అనువాద చిత్రాల‌తో ఇక్క‌డి వారిని ఆక‌ట్టుకున్నాడు. బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్స్ లో అత‌డు ఒక అద్భుత ప్ర‌తిభావంతుడు. హృతిక్, టైగ‌ర్ ష్రాఫ్ త‌ర‌హాలోనే రియ‌ల్ స్టంట్స్ తో ఆక‌ట్టుకోవ‌డం జ‌మ్వాల్ ప్ర‌త్యేక‌త‌. అందుకే అత‌డు న‌టించిన సినిమా వ‌స్తోంది అంటే యూత్ లో ఎంతో కొంత ఆస‌క్తి ఉంటుంది.

విద్యుత్ జ‌మ్వాల్- అర్జున్ రాంపాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన 'క్రాక్ - జీతేగా తో జియేగా' ట్రైలర్ ఎట్టకేలకు విడుద‌లైంది. ట్రైల‌ర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి ఆదిత్య దత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విద్యుత్ జమ్‌వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి, అమీ జాక్సన్ త‌దిత‌రులు న‌టించారు.

రిప్-రోరింగ్ యాక్షన్, అడ్వెంచర్.. స్పోర్ట్స్ స్టంట్‌లతో ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా.. ఫిబ్ర‌వ‌రి 23న విడుద‌ల‌వుతోంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ పై విద్యుత్ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు. అర్జున్ సార్ - విద్యుత్ ల సినిమాని చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను అని ఒక నెటిజ‌న్ అన్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు ఏ బాలీవుడ్ చిత్రంలో చూడలేదు. విద్యుత్ జమ్వాల్ నిజమైన యాక్షన్ స్టార్.. అతను సంపాదించిన దానికంటే ఎక్కువ అర్హుడు. నా మాటలను గుర్తించండి.. ఈ చిత్రం CRAKK విద్యుత్ జ‌మ్వాల్ ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది అని పొగిడేశాడు మ‌రో అభిమాని.

క్రాక్ చిత్రానికి జ‌మ్వాల్ నిర్మాత‌గాను పెట్టుబ‌డి పెట్టారు. భారతీయ సినీ రంగంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌ను అందించాలనేది నా ఆలోచ‌న డ్రీమ్. ఈ కలను రియాలిటీగా మార్చిన అసాధారణ బృందానికి నేను కృతజ్ఞుడను. మేము సృష్టించిన అడ్రినలిన్-విజువ‌ల్ ఫీస్ట్ ని ప్రేక్షకులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను అని అన్నారు.

దర్శకుడు ఆదిత్య దత్ మాట్లాడుతూ హీరో విల‌న్ ఎదురు ప‌డే ప్ర‌తి ఫ్రేమ్ ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని తెలిపారు. ఫిల్మ్ మేకర్‌గా చెబుతున్నాను.. ఇది అద్భుతమైన యాక్షన్ కాంబో. వారి దూకుడు ఆవేశంతో నిండిన వ్యక్తిత్వం ప్రేక్షకులకు కూడా ఆసక్తిని కలిగిస్తుంది. నా లీడింగ్ మ్యాన్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఉండటం ఈసారి ప్రత్యేకం! అని అన్నారు. క్రాక్-జీతేగా తో జియేగా చిత్రాన్ని విద్యుత్ జమ్‌వాల్ యాక్షన్ హీరో ఫిలింస్ నిర్మించాయి. 23 ఫిబ్రవరి 2024న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.