Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ యాజమాన్యం, నాగార్జున పై చూపండి మీప్రతాపం!

ఈ విషయంపై సీపీఐ నారాయణ కూడా ఫైర్ అయ్యారు. అంతకుముందు బిగ్ బాస్ మీద ఫైర్ అవుతూ మాట్లాడిన నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   19 Dec 2023 6:20 AM GMT
బిగ్ బాస్ యాజమాన్యం, నాగార్జున పై చూపండి మీప్రతాపం!
X

ఆరు సక్సెస్ ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రీసెంట్ గా 7వ సీజన్ ని పూర్తి చేసుకుంది. అయితే ఏడు సీజన్లలో ఎప్పుడు జరగని సంఘటన ఈ సీజన్ కి జరిగాయి. ఈ సీజన్ టైటిల్ విజేత ప్రకటించిన తర్వాత అమర్ దీప్ ఫ్యాన్స్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఇక పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ దీప్ కారు అద్దాలు పగలగొట్టారు. అంతేకాదు రెండు ఆర్టీసీ బస్సు అద్దాలు, ఒక పోలీస్ వెహికల్ అద్దాలు పగలగొట్టారని తెలుస్తుంది.

దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ అయితే గొడవ చేసింది ఎవరైనా సరే వారిని శిక్షిస్తామని అన్నారు. ఓ పక్క పోలీసులు కూడా పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై సీపీఐ నారాయణ కూడా ఫైర్ అయ్యారు. అంతకుముందు బిగ్ బాస్ మీద ఫైర్ అవుతూ మాట్లాడిన నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ షో బయట ఆర్టీసీ బస్సులు పగలకొట్టారని సజ్జనార్ కేసులు పెడతా అన్నారు. బిగ్ బాస్ షో అనేది అరాచకం. నేను ఇంతకుముందు నుంచే చెబుతున్నాను.. సజ్జనార్ కమీషనర్ గా ఉన్నప్పుడే బిగ్ బాస్ పై యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ చేశాను. అప్పుడు ఆయన కోర్టుకు వెళ్లండని చెప్పారు. బిగ్ బాస్ మీద చర్యలు తీసుకునేందుకు కోర్టు, పోలీసులు భయపడ్డాయి. బిగ్ బాస్ లో అసాంఘిక, నీచాతి నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. డబ్బులకు కక్రుత్తి పడి నాగార్జున ఈ షో చేస్తున్నారని అన్నారు.

కొందరిని తీసుకెళ్లి ఒక హౌస్ లో పడేసి దాన్ని వ్యభిచారి కొంపలా చేసి దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి గ్రామీణ ప్రాంతాలను అట్రాక్ట్ చేసేందుకు రైతు బిడ్డ అని అతన్ని తీసుకొచ్చారు. పట్టణ ప్రాంతాల్లో వారు షోని పట్టించుకోకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వారిని అట్రాక్ట్ చేసేందుకు అతన్ని గెలిపించారని అన్నారు నారాయణ. ఇదంతా బిగ్ బాస్ యాజమాన్యం చేస్తున్న నాటకమని.. దీన్ని వెంటనే బ్యాన్ చేయాలని కోరుతున్నా అన్నారు నారాయణ.

అయితే ఇదివరకు సీజన్లు ఎలా ఉన్నా ఇలా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని చూడటం మాత్రం కరెక్ట్ కాదని చెప్పొచ్చు. అయితే దీనిపై బిగ్ బాస్ టీం కానీ నాగార్జున కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ఈ ఇష్యూపై నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.