Begin typing your search above and press return to search.

18ఏళ్ల బంధానికి అక్టోబ‌ర్ 7న శాశ్వ‌తంగా ముగింపు!

కోర్టు విచార‌ణ అనంత‌రం అక్టోబ‌ర్ 7న కోర్టు ఉత్త‌ర్వులు మంజూరు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. పిల్ల‌ల బాధ్య‌త‌ల‌కు సంబంధించి కోర్టు దిశానిర్దేశం చేసే అవ‌కాశం ఉంది.

By:  Tupaki Desk   |   16 April 2024 5:38 AM GMT
18ఏళ్ల బంధానికి అక్టోబ‌ర్ 7న శాశ్వ‌తంగా ముగింపు!
X

ఇటీవ‌లే ధ‌నుష్-ఐశ్వ‌ర్యా రాజ‌నీకాంత్ చెన్నై ఫ్యామిలీ కోర్టులో ప‌రస్ప‌ర అంగీకారంతో విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ ఇద్ద‌రికి ఫ్యామిలీ కోర్టు నుంచి అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. అక్టోబ‌ర్ 7న ఇరువురు కోర్టుకు హాజ‌ర‌వ్వాల‌ని న్యాయ‌మూర్తి సుభాదేవి ఆదేశించారు. కోర్టు నిబంధ‌న‌ల ప్ర‌కారం విడాకుల‌కు గ‌ల కార‌ణాల‌ను ఆ రోజు ఇరువురు న్యాయ‌మూర్తి చెప్పాల్సి ఉంటుంద‌ని తెలుస్తుంది. అనంత‌రం అవి అమోద‌యోగ్యంగా ఉంటే విడాకులు మంజూరు అయ్యే అవ‌కాశం ఉంది.

ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య 2004 లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 18 ఏళ్ల పాటు క‌లిసి కాపురం చేసారు. వీరికి ఇద్ద‌రు కుమారులు క‌ల‌రు. విడాకులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ఇరువురు గ‌తంలో సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని అటు ఐశ్వ‌ర్య త‌రుపున తండ్రి ర‌జనీకాంత్...ద‌నుష్ తండ్రి కొన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసారు. కానీ అవేవి ఫ‌లించ‌క‌పోవ‌డంతో తుదిగా విడాకుల నిర్ణ‌యంతో ముందుకొచ్చారు. ఆస‌మ‌యంలోనే ధ‌నుష్ ఓ లేఖ రిలీజ్ చేసారు.

'దంపతులుగా- స్నేహితులుగా- తల్లిదండ్రులుగా 18ఏళ్ల పాటు కలిసి ఉన్నాం. పరస్పరం అర్థం చేసుకోవడం.. వృద్ధి చెందడం.. సర్దుబాట్లతో ఈ ప్రయాణం సాగింది. ఇప్పుడు మా దారులు వేరయ్యే పరిస్థితిలో నిల్చుని ఉన్నాం. దంపతులుగా నేను.. ఐశ్వర్య విడిపోయేందుకు నిర్ణయించుకున్నాం. మమ్మల్ని మేం స్వయంగా అర్థం చేసుకునేందుకు సమయం తీసుకోవాలని అనుకుంటున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ పరిస్థితుల్లో మాకు అవసరమైన ప్రైవసీ ఇవ్వండి' అందులో పేర్కొన్నారు.

కోర్టు విచార‌ణ అనంత‌రం అక్టోబ‌ర్ 7న కోర్టు ఉత్త‌ర్వులు మంజూరు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. పిల్ల‌ల బాధ్య‌త‌ల‌కు సంబంధించి కోర్టు దిశానిర్దేశం చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం పిల్ల‌లు ఇద్ద‌రు యాత్ర‌-లింగ ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్ వ‌ద్ద‌నే ఉంటున్నారు. ప్ర‌స్తుతం ధ‌నుష్-ఐశ్వ‌ర్య సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ధ‌నుష్ హీరోగా సినిమాలు చేసుకుంటుండ‌గా...ఐశ్వ‌ర్య ద‌ర్శ‌కురాలిగా బిజీగా ఉన్నారు. ఇటీవ‌లే ఆమె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'లాల్ స‌లామ్' ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.