Begin typing your search above and press return to search.

మూవీ డేట్‌లో కెమెరాకి చిక్కిన జంట‌

అయితే, అనన్య, ఆదిత్యా రాయ్ కపూర్‌ల డేటింగ్ గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   19 Nov 2023 2:46 PM GMT
మూవీ డేట్‌లో కెమెరాకి చిక్కిన జంట‌
X

స్టార్‌కిడ్ అనన్య పాండే నేడు బాలీవుడ్‌లో ప్రముఖ నటి. 2019లో కరణ్ జోహార్ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2`తో అనన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనన్య ప్రముఖ నటుడు చుంకీ పాండే కుమార్తె. తండ్రి బాటలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనన్య ‘పతి పత్నీ ఔర్ వో’, ‘ఖాలీ పిలి’, ‘గెహ్రయ్యా’, ‘లిగార్’, ‘డ్రీమ్ గర్ల్ 2’ వంటి చిత్రాల్లో నటించింది. అనన్య బాలీవుడ్‌లో తన కెరీర్‌లో కొంతమంది నటీనటులతో ముడిపడి ఉంది. అయితే, అనన్య, ఆదిత్యా రాయ్ కపూర్‌ల డేటింగ్ గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది.

అనన్య - ఆదిత్య వెకేషన్స్ నుండి డిన్నర్ డేట్స్ వరకు చాలా చోట్ల కలిసి కనిపిస్తారు. వీరిద్దరు తమ రిలేషన్ షిప్ గురించి ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే చాలా సార్లు ఇద్దరూ కలిసి కనిపించారు. ఇప్పుడు అనన్య -ఆదిత్య రాయ్ క‌పూర్ జంట‌ సినిమా డేట్‌కి వెళ్లడం అలా కనిపించింది.

అనన్య, ఆదిత్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ జంట ముంబైలోని థియేటర్ వెలుపల కనిపించింది. అయితే ఇద్దరూ వేర్వేరు కార్ల నుంచి వచ్చారు. వైరల్ వీడియోలో అనన్య ఆరెంజ్ టాప్ ధరించి కనిపించగా, ఆదిత్య బ్లాక్ టీ-షర్ట్‌లో కనిపించాడు.

రీసెంట్ గా ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా అనన్య సోషల్ మీడియాలో విషెస్ చెప్పింది. ఆదిత్య ఫోటోను షేర్ చేసింది. హ్యాపీ బర్త్‌డే ఆదిత్య… అంటూ ఫోటోతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో రొమాంటిక్ పాటను కూడా ప్లే చేసింది. అనన్య పుట్టినరోజు వేడుక‌ల్ని ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి ఈ జంట మాల్దీవులకు వెళ్లారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అనన్య `ఖో గయే హమ్ కహాన్`లో కనిపించనుండగా, ఆదిత్య సారా అలీ ఖాన్ సరసన `మెట్రో ఇన్ దిన్`లో కనిపించనున్నారు.