Begin typing your search above and press return to search.

అన్ని గొడ‌వ‌ల్ని లైట్ తీస్కున్న నిర్మాణ సంస్థ‌

కొద్దిరోజులుగా నెగిటివ్ రివ్యూలు మీమ్‌లకు వ్యతిరేకంగా కాపీరైట్ స్ట్రైక్‌ల సందర్భాలను ప్రదర్శించే స్క్రీన్‌షాట్‌లను వారు షేర్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Aug 2023 8:15 AM IST
అన్ని గొడ‌వ‌ల్ని లైట్ తీస్కున్న నిర్మాణ సంస్థ‌
X

ఇటీవల విడుదలైన అగ్ర‌ తెలుగు హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశాజనక ఫలితాన్ని ఎదుర్కొంది. స్టార్-స్టడెడ్ తారాగణంతో తెర‌కెక్కినా కానీ ఈ చిత్రం అభిమానులను ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది. పాత మూస విధానంలో క‌థ‌నం స‌న్నివేశాలు తేలిపోయాయి. ఫ‌లితంగా థియేట‌ర్ల‌లో షోల‌న్నీ డీలా ప‌డియాయి.

తాజా పరిణామంతో చిత్ర‌బృందానికి చెందిన ప్ర‌చార‌క‌ర్త‌లైన‌ డిజిటల్ బృందం ప్రవర్తనకు సంబంధించి మీమ్ కమ్యూనిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. కొద్దిరోజులుగా నెగిటివ్ రివ్యూలు మీమ్‌లకు వ్యతిరేకంగా కాపీరైట్ స్ట్రైక్‌ల సందర్భాలను ప్రదర్శించే స్క్రీన్‌షాట్‌లను వారు షేర్ చేస్తున్నారు. ఈ పరిస్థితి మీమ‌ర్ ల‌లో నిరాశకు కార‌ణ‌మైంది. అయితే చిత్ర‌ బృందం ఈ ఆరోపణలపై స్పందించకూడదని లైట్ తీస్కుంది.

అయితే అందుకు భిన్నంగా తమకు చిత్ర క‌థానాయ‌కుడితో నిర్మాతకు మధ్య ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేసేందుకు నిర్మాణ సంస్థ‌ ముందుకొచ్చింది. ప్రస్తుతం వ్యాపిస్తున్న ఆన్‌లైన్ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవిగా వారు కొట్టి పారేసారు.